ఇంటర్వ్యూలో రెజినాతో ఎఫైర్ గురించి అడిగితే…”సాయి ధరమ్ తేజ్” ఫన్నీగా ఏమన్నారో తెలుసా..?

సినిమా హీరోలు,హీరోయిన్లు ప్రేమలో పడటం పెళ్లి చేసుకోవడం కొత్తేం కాదు..ఆ ప్రేమ పెళ్లి పీటలెక్కడం..ఆ పెళ్లి కలకాలం నిలవడమే విశేషం..గతంలో జీవితా ,రాజశేఖర్ , అమలా,నాగార్జున అలాంటి జంటల్లో ముందుంటారు.పవన్ కళ్యాణ్,రేణుదేశాయ్ ప్రేమాయణం,సహజీవనం ,పెళ్లి..ఆ తర్వాత వారు విడాకులు తీసుకున్నప్పటికీ ఇద్దరి మధ్య సత్సంభందాలే ఉన్నాయి..ఇప్పుడు మామ బాటలోనే అల్లుడు సాయిధరమ్ తేజ్ వెళ్తున్నాడని..స్టార్ హీరోయిన్ రెజీనా తో సాయి లవ్ లో ఉన్నాడనే వార్తలు వినిపించాయి…ఇదే విషయంపైన ఈ మద్య రెజీనా స్పందించారు..ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ..ఇంతకీ వీరేమన్నారో తెలుసా…

సాయి ధరమ్ తేజ్,రెజీనా పిల్ల నువ్వులేని జీవితం సినిమాలో ఫస్ట్ కలిసి నటించారు..అప్పుడే లవ్ లో పడ్డారని..ఆ తర్వాత సుభ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో మళ్లీ నటించిన టైంలో వారి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండడానికి రీజన్ వారిమధ్య లవ్ ఎఫైర్ ఉండడమే అనే వార్తలొచ్చాయి.వరుస సినిమాలు చేస్తున్న హీరో హీరోయిన్లపై ప్రేమలో ఉన్నారని కామెంట్స్ రావడం,వాటిని వాళ్లు కొట్టిపారేయడం మూములు విషయమే…సాయి ఇప్పటికే రెజీనాతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడని పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని ,ఈ పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించాయని వార్తలొచ్చాయి..అయితే ఈ విషయంపై సాయిధరమ్ తేజ్ ఏమన్నారంటే…

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ సాయిధరమ్ తేజ్ ని ఇదే ప్రశ్న అడిగారు..రెజీనా తో ఏదో ఎఫైర్ నడిచిందనే వార్తలు వస్తున్నాయి అంటే మధ్యలోనే ఇంటర్వ్యూయర్ మాటలు కట్ చేస్తూ మాకు ఇద్దరు పిల్లలున్నారు.ఒక అమ్మాయి సెకండ్  క్లాస్,పెద్దమ్మాయి  ఫోర్త్ క్లాస్ చదువుతుంది అంటూ రిప్లై ఇచ్చారు..ఈ మద్య రెజీనా ఒక హీరోతో లవ్ లో ఉండడం వలనే అనేక అవకాశాలు కోల్పోయాను..ఇప్పుడు కెరీర్ పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాను అని వ్యాఖ్యానించింది.. వీరిద్దరిని ఎవరు ఎంత కార్నర్ చేద్దామని చూసిన వారిమధ్య ఏం లేదు అని ఎవరూ బైటికి చెప్పట్లేదు.ఏదో ఒకటి చెప్పి ఆ పరిస్తితిని దాటేస్తున్నారు..నిజంగానే వారిమధ్య రిలేషన్ ఉంటే చూద్దాం ఎంతకాలం దాచి ఉంచుతారో…

watch video here:

Comments

comments

Share this post

scroll to top