లైవ్ మీట్ లో “స్టార్ హీరో” తండ్రి అవమానించే సరికి…ఏడ్చేసిన “కబాలి హీరోయిన్.! అసలేమైంది? [VIDEO]

హీరో శింబు తండ్రి అందరి ముందు ఓ హీరోయిన్‌ను కడిగిపారేశారు. శింబు తండ్రి టి.రాజేందర్ ప్రముఖ నటుడు, దర్శకుడు. అయితే చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన యువనటి ధన్సికపై శివాలెత్తిపోయారు. ధన్సిక ప్రసంగంలో తన పేరు ప్రస్తావించలేదని ఆగ్రహంతో ఊగిపోయారు. పొరపాటున మరచిపోయానని చెప్పినా రాజేందర్ లెక్కపెట్టలేదు. సారీ చెప్పినా కనికరించలేదు. దీంతో ధన్సిక వేదికపైనే కన్నీటి పర్యంతమయింది.

రాజేందర్-ధన్సిక వివాదానికి ‘విళితిరు’ సినిమా ప్రెస్‌మీట్ వేదికైంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ధన్షిక ‘విళితిరు’ గురించి మాట్లాడింది. నటీనటులు, టెక్నీషియన్స్‌ అందరి గురించి ప్రస్తావించింది. కానీ ఈ సినిమాలో ఓ పాట పాడిన రాజేందర్‌ పేరు చెప్పడం మరచిపోయింది. దీన్ని అవమానంగా భావించిన రాజేందర్‌.. స్టేజ్‌పైనే ఆగ్రహం ప్రదర్శించారు. ‘కబాలి’ సినిమాలో రజినీకాంత్‌తో నటించినంత మాత్రాన హీరోయిన్లు అయిపోరని, పెద్దలను గౌరవించాలని చురకలంటించారు. సహచర ఆర్టిస్టులకు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలని తిట్టారు. పెద్ద ఆర్టిస్టులకు గౌరవించకపోతే భవిష్యత్‌ ఉండదని హెచ్చరిస్తూ ఆమె వైఖరిని కఠినంగా తప్పుబట్టారు.

దీంతో ధన్సిక.. రాజేందర్ పాదాలను తాకి క్షమాపణలు కోరింది. అయినప్పటికీ శాంతించని రాజేందర్.. ‘నువ్వు చీర కట్టుకోలేదు.. నీ క్షమాపణ నాకు అవసరం లేదు. నువ్వు హన్సిక అయితే నాకేంటి.. ధన్సిక అయితే నాకేంటి’ అంటూ అంతెత్తులేచారు. రాజేందర్ మాటలతో తీవ్రంగా బాధపడ్డ ధన్సిక.. అందరి ముందు బోరున విలపించింది. ఈ ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజేందర్ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళ పట్ల వ్యవహరించాల్సిన పద్ధతి ఇదేనా అని దుమ్మెత్తిపోస్తున్నారు.

watch video here:

Comments

comments

Share this post

scroll to top