ఫ్రీ వైఫై వాడుతున్నారా..అయితే ఈ జాగ్రత్తలు తప్పక పాటించాల్సిందే…!

ఫ్రీ గా వస్తే ఫినాయిల్ అయినా తాగుతాం అనే సామెత వినగానే నవ్వొస్తుంది కానీ..ఫ్రీ గా వస్తే ఆసక్తి చూపనివారు 0.0001 పర్సంట్ కూడా వుండరు అంటే అతిశయోక్తి కాదు..ఇక ఇప్పుడు ఫ్రీ అనే పదం వినగానే ఫ్రీ వైఫై ఏ  గుర్తొస్తుంది.అంతలా కనెక్ట్ అయ్యాం ఇంటర్నెట్ కి..ఎక్కడైనా ఫ్రీ వైఫై ఉందనగానే ముందుగా ఫోన్ తీసి కనెక్ట చేసి వాడేస్తుంటాం..ముఖ్యంగా
ఎయిర్‌పోర్ట్‌.. రైల్వేస్టేషన్‌.. బస్టాండ్‌.. లాడ్జింగ్‌.. ఇలా ఎక్కడికెళ్లినా వెంటనే ఫ్రీ వైఫై కోసం వెతుకుతాం. వారు అడిగిన వివరాలు ఇచ్చి వెంటనే లాగిన్‌ అవుతాం. ఫ్రీ వైఫై ని ఎలా వాడుతున్నారో తెలుసుకోండి..
 • సోషల్‌ మీడియాలో వ్యక్తిగత వివరాలు ఎడిట్‌ చేసేందుకూ అనుమతించే వారు 19%
 • పబ్లిక్‌ వైఫై ద్వారా బ్యాంక్‌ అకౌంట్లు చూసుకోవడం, ఫొటోలు షేర్‌ చేసుకునే వారు 96%
 • పబ్లిక్‌ వైఫై వాడినా తమ వివరాలకు వచ్చిన నష్టమేమీ లేదనుకునే భారతీయులు 74%
 • కొత్త చోటికి వెళితే వైఫైలోకి ప్రవేశించేందుకు నిమిషమూ నిలవలేని వారు 51%
 • వ్యక్తిగత ఈమెయిల్, కాంటాక్ట్స్‌ వివరాలు ఇచ్చేం దుకు సిద్ధంగా ఉన్న వారు 19%
 • వైఫైతో పోలిస్తే సురక్షితమైన వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌(వీపీఎన్‌)ను వాడే వారు 48%
 • పబ్లిక్‌ వైఫైతో అసభ్య చిత్రాలు, వీడియోలు చూసే వారు 31%

పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే మన వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు పడరాని ఇతరుల చేతుల్లో పడితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనని నార్టన్‌ సర్వే హెచ్చరిస్తోంది. అయితే ఇలాంటి ఫ్రీ  వైఫైలతో చాలా సమస్యలు నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం..

 • అప్ డేటెడ్ OS వాడుతుండడం ఉత్తమం.దీంతో డివైజ్ ఎక్కువ సురక్షితంగా ఉంటుంది
 • యాంటీవైరస్ టూల్స్ వాడండి
 • నగదు లావాదేవీలు,పాస్ వర్డ్ ఎంటర్ చేసే పనులు చేయకండి
 • లేటెస్ట్ మొబైల్స్ లో టూ ఫ్యాక్టర్ సెక్యూరిటీ ఉంటుంది.దాన్ని  ఆన్ చేసుకోండి
 • పని పూర్తైతే వెంటనే వైఫై ఆఫ్ చేయండి
 • VPNద్వారా ఉచిత వైఫై వాడుకోవడం ఉత్తమం.

Comments

comments

Share this post

scroll to top