తన శాడిస్ట్ భర్త వల్ల ఈ మహిళ ఎదుర్కొన్న సమస్యలు…ఆమె మాటల్లోనే.!

17 యేళ్ల వయసులో.. నా MBBS క్లాస్ మేట్ అయిన ఓ అబ్బాయిని చూసి ఇష్టపడ్డాను.ఆ ఇష్టమే క్రమంగా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందాం అనుకునే లోపు….వాళ్ల అమ్మానాన్న కొన్ని నిబంధనలు పెట్టారు..వాటన్నింటికీ ఒప్పుకొని ఎలాగో అలా పెళ్లి చేసుకున్నాం. అప్పటి వరకు హీరోలా కనిపించిన నా భర్త వెనుక దాగున్న రాక్షసత్వం అప్పుడే చూశాను… మొదటి రాత్రి రతిలో నాకు బ్లీడ్ అవ్వలేదని..నువ్వు వర్జిన్ కాదని…. నా భర్త నన్ను తిట్టిపోశాడు. ఆ రోజు నుండి నన్ను…ఓ చీడ పురుగును చూసినట్టు చూసేవాడు.

అప్పటి వరకు అల్లారుముద్దుగా పెరిగిన నేను…అత్తారింట్లో…అన్ని పనులు చేయాల్సి వచ్చేది. అదే సమయంలో  ఎలాగో అలా  MBBS పూర్తి చేసుకున్నాను. మరోవైపు నా భర్త వేధింపులు ఎక్కువయ్యాయ్… మా మామ గారికి మూడు క్లినిక్ లు ఉన్నాయి..వాటిని మామ గారే చూసుకుంటారు. దీంతో నా భర్త రాత్రంతా తాగుతూ…ఎప్పుడో ఉదయం పడుకునే వాడు…సాయంత్రానికి లేచేవాడు.

HOB-WIFE-750x500

ఇదే సమయంలో నేను ఓ పాపకు జన్మనిచ్చాను. నా భర్త కొడుకును ఎందుకివ్వలేదంటూ మరోసారి అదేపనిగా మొఖం మీద గుద్దాడు. మా మామ గారు కాలం చేసిన తర్వాత మరీ మా ఆయన తాగుడుకు అడ్డు అదుపు లేకుండా పోయింది.

పాప పెరిగి పెద్దదవుతుంది. అథ్లెట్ కావాలని దాని ఆశ…అందుకోసం ప్రతిరోజు ఉదయం 5 గంటలకే నిద్రలేచి ప్రాక్టీస్ కు వెళ్లేది నేను కూడా ఆమెతో పాటు వెళ్లేదాన్ని…ఓ రోజు మా ఆయన మా వెనకాలే ఫాలో అయ్యారు. నేను అక్కడి వాష్ రూమ్ లోకి వెళ్లినప్పుడు పాప దగ్గరికి వచ్చిన ఆయన అందరి ముందు…ఎక్కడే మీ అమ్మ? ఎవడితో కులకడానికి వెళ్లింది? అని అందరి ముందు నా పరువు ,నా పాప పరువు తీశాడు.  ఓ భర్తగా అతడు నా దృష్టిలో అప్పుడే చనిపోయాడు.

ఇలా ఓ 20 యేళ్లు గడిచిపోయాయి..ఇక ఓపిక నశించిన నేను…స్వంతంగా ఓ క్లినిక్ పెట్టుకున్నాను. దాని మీదే మా ఇంటిని పోషించుకుంటున్నాను. దేవుడి దయవల్ల క్లినిక్ బాగా నడుస్తుంది.మేము కూడా అతనికి దూరంగా హాయిగా బతుకుతున్నాము. నేను పడ్డ బాధ గుర్తొచ్చినప్పుడల్లా…ఇదిగో నా కూతురు నాకు రాసిచ్చిన ఈ లెటర్స్ చదువుతూ…మరిచిపోతుంటాను.

13640940_509615569247425_25781941445419965_o-1024x768

Source: Humans Mumbai.

Comments

comments

Share this post

scroll to top