“సచిన్” ఎత్తుకున్న ఆ “చిన్న పాప” ఎవరో తెలుసా?…ఎవరి కూతురు అనుకుంటున్నారు?…

సచిన్‌ ఎత్తుకున్న ఆ చిన్నారి ఎవరో తెలుసా ? భారత దిగ్గజ బ్యాట్స్‌మన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ రోజు ట్విట్టర్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేసారు. ఓ అందాల చిట్టి బొమ్మను ఎత్తుకొని, ఆమెతో ఎంతో ఆనందంగా ఆడుకుంటున్న ఫొటోలు అవి. ముద్దులొలికే ఆ చిన్నారిని ఎత్తుకున్న సచిన్ ఎంతో సంతోషంతో మురిసిపోపతున్నట్లు ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మరి సచిన్‌ను అంతగా కట్టిపడేసిన ఆ చిన్నారి ఎవరో తెలుసా..?

మరెవరో కాదండి… భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ గారాల పట్టి “హినయా హీర్”. ​ ఏ సందర్భంలో వీరిద్దరూ కలిసారో తెలియదు కానీ.. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతున్నాయి. హర్భజన్ సింగ్ భార్య గీతా బస్రా కూడా తన కూతురు సచిన్‌తో ఉన్న ఫొటోను ట్వీట్ చేసారు. ‘లిటిల్ మాస్టర్ లిటిల్ ఫ్యాన్’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మొత్తానికి సచిన్ చాలా సరదాగా గడిపారు అంట ఆ చిన్న పాపతో!

Comments

comments

Share this post

scroll to top