బైక్ మీద వెళ్లే ఇద్దరు “సచిన్” తో సెల్ఫీ దిగాలనుకున్నారు..కానీ “సచిన్” కార్ ఆపి ఏం చేసారో తెలుసా..?

ఇద్దరు బైక్ మీద వెళుతున్నారు. పక్కనే ఖరీదైన కార్ ఒకటి ఆగింది. ఎవరా అని చూస్తే క్రికెట్ లెజెండ్ “సచిన్ టెండూల్కర్” ఉన్నారు కార్ లో. ఇక ఆ అబ్బాయిలు ఎలాగైనా సరే “సచిన్” తో సెల్ఫీ దిగాలని చాలా ప్రయత్నించారు. కార్ పక్కనే విండో దగ్గర ఆపి ఫోటో తీసుకునే ప్రయత్నం చేసారు. ఈ లోపు “సచిన్” కార్ ఆపారు. ఆపి ఏం చేసారో తెలుసా..?

ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఆ ఇద్దరు కుర్రాళ్ళు హెల్మెట్ లేకుండా వెళుతుండడంతో..”సచిన్” తన కార్ ఆపి వాళ్ళను “హెల్మెట్” ధరించండి అని చెప్పారు. ఇంతలో మరో జంట కూడా హాయ్ అని చెప్పడంతో, వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం గమనించి హెల్మెట్ ధరించండి అన్నారు “సచిన్”. ఈ వీడియో ను రికార్డ్ చేసి తన ఫేస్బుక్, ట్విట్టర్ కాతాల్లో అప్లోడ్ చేసారు “సచిన్”. సేఫ్టీ కోసం హెల్మెట్ ధరించండి అని మెసేజ్ పెట్టారు. ఆ వీడియో కి సోషల్ మీడియా లో అభిమానులంతా ఫిదా అయిపోయారు..!

ప్రమాదాలు నివారించేందుకు ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఎన్ని ప్రకటనలు జారీ చేసినా.. హెల్మెట్ ధరించకుండా.. వాహనాలు నడిపే వాళ్లే ఎక్కువ. జుట్టు పాడవుతుందని హెల్మెట్ ధరించరు మరికొందరు. కానీ అదే హెల్మెట్ ప్రమాదాల సమయంలో ప్రాణాలు కాపాడుతుందని తెలియజెప్పారాయన. సచిన్ టెండుల్కర్ చెప్పాకైనా ఆ యువకులు హెల్మెట్ ధరిస్తే.. అది ఎందరికో స్ఫూర్తినిస్తుంది. ఇకపై బైక్ మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్.

Watch Video:

Helmet Dalo!! Road safety should be the highest priority for everyone. Please don't ride without a helmet.

Posted by Sachin Tendulkar on Saturday, 8 April 2017

 

Comments

comments

Share this post

scroll to top