సచిన్ కొడుకా మజాకా….!!

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ కూడా తండ్రికి తగ్గ తనయుడనిపించుకుంటున్నాడు. అప్పుడప్పుడూ భారత ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ కనిపించే అర్జున్ ఇప్పుడు ఇంగ్లండ్ ఆటగాళ్లతో కలిసిపోయాడు. యాషెస్ సిరీస్‌ కోసం ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న ఇంగ్లాండ్ క్రికెటర్లకు అర్జున్ బౌలింగ్ చేసి అదరగొట్టాడు. చాలామంది ఆటగాళ్ల చేత ఔరా అనిపించాడు. అతడి బౌలింగ్ ప్రతిభకు ఇంగ్లాడ్ ఆటగాళ్లు ముగ్దులయ్యారు. అర్జున్ బౌలింగ్ చేస్తుంటే ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ కుక్ చాలాసేపు పరిశీలిస్తూ ఉండిపోయాడు.

ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ కోచ్ గిబ్సన్ అయితే, అర్జున్ వద్దకు వచ్చి కొన్ని చిట్కాలు కూడా చెప్పాడు.

క్రికెట్‌లో మరింత రాటుదేలేందుకు అర్జున్ ఇంగ్లాండ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సచిన్ బ్యాట్స్ మన్ గా ఎదిగితే కొడుకు అర్జున్ మాత్రం మంచి బౌలర్ గా ఎదగాలని కోరుకుంటున్నాడు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top