టీమ్ ఇండియాలోకి ముగ్గరు మొనగాళ్లు

భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు క్రికెట్ కు దేశానికి తమ సేవలు అందించడానికి మరోసారి రెడీ అయ్యారు. కానీ ఈ సారి ఫీల్డ్ ల బయట ఉండే తమ సేవలు అందించనున్నారు. ఈ భారత క్రికెట్ త్రయాన్ని  అడ్వైజరీ కమిటీలో మెంబర్స్‌గా చేర్చింది BCCI ఈ విషయాన్ని సోమవారం బీసీసీఐ అధికారికంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

అపూర్వ అనుభవం గల ఈ ముగ్గురి సలహాలు, సూచనలు యువ క్రీడాకారులకు మార్గనిర్దేశం చేసే విధంగా ఉంటాయని BCCI సెక్రెటరీ అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఇప్పటికే IPL లో ముంబాయి ఇండియన్స్ కు మెంటర్ గా వ్యవహరించిన సచిన్ తన జట్టు కు టోర్నిని అందించాడు.. లక్ష్మణ్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ కు మెంటర్ గా సేవలందించాడు.గంగూళీ  గతంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ కు మెంటర్ గా వ్యవహరించాడు.. దీనికి తోడు సుధీర్ఘ కెప్టెన్సీ అనుభవం ఉంది.

sachin-ganguly-vvs-advisory-committe

అంతా బాగానే ఉన్నా ది వాల్ కు మాత్రం ఇందులో చోటు దక్కకపోవడం తో క్రికెట్ అభిమానులు కాసింత అసహనం తో ఉన్నారు. ద్రావిడ్ ను కూడా ఈ కమిటీ లో చేర్చుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.. మొత్తానికి మంచి ఊపులో ఉన్న టీమ్ ఇండియా క్రికెట్…. వీరి రాకతో మరింతగా పుంజుకోవాలని ఆశిద్దాం… ఆల్ ది బెస్ట్ ముగ్గురు మొనగాళ్లు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top