గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఆయనపై చీటింగ్ కేసుతో నమోదు అయింది. ‘నీ జతగా నేనుండాలి’ సినిమా వివాదంపై హీరో సచిన్ జోషి వైకింగ్ మీడియా నుండి బండ్ల గణేష్ లీగల్ నోటీసులు అందుకున్నారు. హిందీ లో సూపర్ హిట్ అయిన ‘ఆషికి 2’ చిత్రాన్ని నీ జతగా నేనుండాలి పేరుతో తెలుగులో రీమేక్ చేసారు.
సచిన్ జోషి, నజియా జంటగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై జయ రవీంద్ర దర్శకత్వంలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి గణేష్ ప్రొడ్యూసర్గా బండ్ల గణేష్ ఉన్నప్పటికీ ఆ సినిమా నిర్మాణానికి పెట్టుబడి పెట్టింది సచిన్ జోషినే. అయితే ఆ సినిమా విషయంలో గణేష్ తనని మోసం చేశాడని, డిస్ట్రిబ్యూషన్ డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని సచిన్ డైరెక్టర్ గా ఉన్న వైకింగ్ మీడియా ఫిర్యాదు చేసింది. సినిమా బాగానే ఆడినప్పటికీ లాభాల్లో వాటా ఇస్తానని చెప్పి… చివరికి నష్టాలు వచ్చాయని బండ్ల గణేష్ తప్పుడు లెక్కలు చూపినట్లు సమాచారం.