“సచిన్” బర్త్ డే సందర్బంగా “పూణే – ముంబై” ఐపీఎల్ మ్యాచ్ లో “ఫాన్స్” స్టేడియంలో ఏం చేసారో తెలుసా..?

స‌చిన్ టెండూల్క‌ర్‌..! ఈ పేరు చెబితే చాలు, 120 కోట్ల మంది భార‌తీయులు ఒకేసారి స‌చిన్‌… స‌చిన్‌… అని అరిచిన‌ట్టు ఫీలింగ్ క‌లుగుతుంది. క్రికెట్ దేవుడిగా కొన్నేళ్ల పాటు క్రికెట్ ను ఏలిన చ‌క్ర‌వ‌ర్తిగా సచిన్ మ‌న హృద‌యాల్లో నిలిచిపోయాడు. అత‌ని ఆట అంటే మ‌న‌కే కాదు, విదేశాల్లో ఉన్న అభిమానుల‌కు కూడా పండ‌గే. ఇత‌ర దేశాల‌కు చెందిన క్రికెట‌ర్లు కూడా సచిన్‌ను బాగా అభిమానిస్తారు. అంత‌లా స‌చిన్ అంద‌రి మ‌న‌స్సుల్లో నిలిచిపోయాడు. ఆ రోజున‌… అంటే.. నవంబ‌ర్ 16, 2013న స‌చిన్‌… క్రికెట్ మైదానానికి, ఆ ఆట‌కు శాశ్వ‌తంగా వీడ్కోలు ప‌లికిన నాడు… మ‌నంద‌రి క‌ళ్లు చెమ‌ర్చాయి. అయిన‌ప్ప‌టికీ… ఇప్పటికీ స‌చిన్ అంటే క్రేజ్ అలాగే ఉంది. ఏ మాత్రం త‌గ్గలేదు.

అయితే ఏప్రిల్ 24 న (సోమవారం) సచిన్ బర్త్ డే. అదే సమయంలో ముంబైలోని “వాంఖేడే” స్టేడియంలో “పూణే – ముంబై” జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా..! “సచిన్” అభిమానులంతా కలిసి “హ్యాపీ బర్త్ డే” సచిన్ అని పాట పాడారు..! ఆ వీడియో మీరే చూడండి!

Comments

comments

Share this post

scroll to top