“నిన్న రాత్రి సుప్రియను మోసం చేశా” అన్న మాటలు ఆమె విన్నది.! తర్వాత తెలివిగా ఏం చేసిందో తెలుసా.?

గ‌ర్ల్‌ఫ్రెండ్స్‌ను బాయ్ ఫ్రెండ్స్‌.. బాయ్ ఫ్రెండ్స్‌ను గ‌ర్ల్ ఫ్రెండ్స్ చీట్ చేయ‌డం మామూలే. అంద‌రూ అలా ఉండ‌రు, కానీ కొంత‌మందికి మాత్రం ఇలా చేయ‌డం అంటే స‌ర‌దా. కేవ‌లం అవ‌స‌రానికే కొంద‌రు ఇలా చేస్తారు. అవ‌స‌రం తీరాక దుస్తులు మార్చినంత తేలిగ్గా త‌మ ల‌వ‌ర్స్‌ను మార్చేస్తారు. అయితే అలాంటి ఓ యువ‌కుడి గురించి ఓ యువ‌తి విన్న‌ది. ఎలా అంటే.. స్వ‌యంగా ఆ విష‌యం అత‌నే వేరే వ్య‌క్తికి చెప్పాడు. ఆ స‌మ‌యంలో ఆ యువ‌తి ఆ విష‌యం విన్న‌ది. దీంతో ఆ యువ‌కుడి నుంచి మోస‌గింప‌బ‌డుతున్న అత‌ని గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను కాపాడాల‌ని అనుకుంది. అందుకు ఆమె ఏం చేసింది, ఇంత‌కీ అస‌లు జ‌రిగిన విష‌యం ఏమిటంటే…

ఆమె పేరు ఐశ్వ‌ర్య శ‌ర్మ‌. ఉంటున్న‌ది ముంబైలో. ఈమె ఈ మ‌ధ్య ముంబై అంధేరిలోని ఓ హోట‌ల్‌లో డిన్న‌ర్ చేస్తుండ‌గా త‌న వెనుక‌నే అమన్ అనే వ్య‌క్తి త‌న‌కు సుప్రియ అనే యువ‌తితో ఉన్న అఫెయిర్ గురించి వేరే వ్య‌క్తితో చెబుతుండ‌గా ఐశ్వ‌ర్య విన్న‌ది. స‌ద‌రు సుప్రియ‌ను చీట్ చేసి నిధి అనే మరో యువ‌తితో ఆ రోజు రాత్రి వెళ్లాన‌ని అమ‌న్ అత‌నికి ఎదురుగా ఉన్న మ‌రో యువ‌కుడితో చెబుతుండ‌గా దాన్ని ఐశ్వ‌ర్య విన్న‌ది. దీంతో ఆమె ఎలాగైనా అమ‌న్‌కు బుద్ధి చెప్పాల‌ని, ఈ విష‌యాన్ని సుప్రియ‌కు చెప్పాల‌ని అనుకుంది. అయితే ఆమెకు సుప్రియ ఎవ‌రో తెలియ‌దు క‌దా. దీంతో ఆమె ఒక ప‌నిచేసింది. అదేమిటంటే…

అమ‌న్ అనే అత‌ను సుప్రియను చీట్ చేశాన‌ని వేరే వ్య‌క్తికి చెబుతుండ‌గా ఆ మాట‌లు విన్న ఐశ్వ‌ర్య ఎలాగైనా సుప్రియ‌కు ఈ విషయం చెప్పాల‌ని భావించి తాను విన్న విష‌యంపై త‌న ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్టు పెట్టింది. స‌ద‌రు అమ‌న్ ఒక చీట‌ర్ అని, క‌నుక సుప్రియ అనే పేరున్న ఎవ‌రైనా యువతులు అమ‌న్ అనే యువ‌కున్ని గ‌న‌క ప్రేమిస్తూ ఉంటే వారు వెంట‌నే అమ‌న్‌తో తెగ‌దెంపులు చేసుకోవాల‌ని, అమ‌న్ మోసం చేస్తున్నాడ‌ని, దాన్ని సుప్రియ గ్ర‌హించాల‌ని ఐశ్వ‌ర్య పోస్టు చేసింది. దీంతో ఈ పోస్టు కాస్తా నెట్‌లో వైర‌ల్ అయింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆ సుప్రియ ఎవ‌రో తెలియ‌లేదు. కానీ త్వ‌ర‌లోనే అస‌లైన సుప్రియ‌కు అమ‌న్ చేస్తున్న మోసం తెలుస్తుంద‌ని ఐశ్వ‌ర్య భావిస్తోంది. మ‌రి ఈ విష‌యంలో మీరేమంటారు, ఈ విష‌యాన్ని సుప్రియ ఎలాగైనా తెలుసుకుంటుందంటారా ? లేదా..! చూద్దాం మరి..!

Comments

comments

Share this post

scroll to top