మాధవన్ "సాలా ఖాడూస్" సినిమా ట్రైలర్….ఇండియన్ గేమ్స్ దుస్థితిని గట్టిగా చూపించాడు.!

ఒక మంచి బాక్సర్ ను తయారుచేయాలన్న తపన ఉన్న బాక్సింగ్ కోచ్, ఒక అమ్మాయిని బాక్సింగ్ లో ఛాంపియన్ ను చేయడానికి ఎలాంటి సమస్యలు ఎదురుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘సాలా ఖాడూస్’. మనదేశంలో ప్రతిభ ఉన్నవారు గల్లీ గల్లీకి ఉన్నారు, కానీ ఆటల్లోనూ రాజకీయాలు జరగుతుండటం వల్ల వారి ప్రతిభ మరుగున పడిపోతుందని, బాక్సింగ్ కోచింగ్ గా ఢిల్లీలో సేవలందిస్తున్న మాధవన్, అధికారులపై మండిపడతాడు. దీంతో అతడ్ని చెన్నైకి ట్రాన్స్ఫర్ చేస్తారు. చెన్నైకి వచ్చిన మాధవన్ కు, బాక్సింగ్ చేసే ఎవరిలోనూ స్పార్క్ కనిపించదు , కానీ అక్కడ టోర్నీ ఆర్గనైజర్స్ తో గొడవపడుతున్న బస్తీ అమ్మాయిని చూసి తనే బాక్సింగ్ ఛాంపియన్ అని, ఆమెకు బాక్సింగ్ కోచింగ్ ఇస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు,చివరికి ఆ అమ్మాయిని బాక్సింగ్ చాంపియన్ ను అయ్యిందా లేదా అనేది మిగతా స్టొరీ.

కొన్నిరోజుల క్రితం విడుదలైన ఈ చిత్ర టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాజ్ కుమార్ హిరాణీ. హిందీ, తమిళ భాషలలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుధ కొంగర ప్రసాద్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కోసం లవర్ బాయ్ మాధవన్ కండలు పెంచి, మునుపటికంటే ఎక్కువ బరువు పెరిగాడు. జనవరి 29న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Watch Trailer:

Comments

comments

Share this post

scroll to top