సాహో రిలీజ్ డేట్ ప్రకటించిన ప్రొడ్యూసర్స్. ఎప్పుడో తెలుసా..?

సాహో. ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులే కాదు, సినిమా అభిమానులు కూడా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. బాహుబలి-2 తరువాత వస్తున్న చిత్రం కాబట్టి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సుమారు 350 కోట్ల బడ్జెట్ తో సాహో సినిమా ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ను రెండు పార్ట్ లు గా రిలీజ్ చేయనున్నారని సమాచారం, సాహో సినిమా ని ఈ సంవత్సరం లోనే రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది.

కనీసం 2019 సంక్రాంతి లేదా సమ్మర్ కి వస్తుందని అందరు భావించారు. చివరికి ఆగస్టు 15 2019 న రిలీజ్ చేస్తాం అని ప్రకటించారు. విజయ్ దేవరకొండ సాహో సినిమా అప్డేట్ ఇవ్వండి అన్న అంటూ ప్రభాస్ టాక్సీవాలా కు విష్ చేసిన పోస్ట్ లో అడిగాడు, ఆ తరువాతనే సాహో టీం రిలీజ్ డేట్ ప్రకటించారు. సాహో అప్డేట్ రావడానికి కారణం మన రౌడీ నే.

saaho vijay devarakonda

తెలుగు, హిందీ, తమిళ్ బాషలలో ఏక కాలం లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి శర్వానంద్ నటించిన సూపర్ హిట్ చిత్రం రన్ రాజా రన్ డైరెక్టర్ సుజీత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. సుజీత్ కి ఇది దర్శకుడిగా కేవలం రెండో సినిమా నే . మొదటి సినిమా అయినా రన్ రాజా రన్ సినిమా ను చాలా బాగా తెరకెక్కించాడు, శర్వానంద్ ని కమర్షియల్ హీరో గా నిలబెట్టిన సినిమా రన్ రాజా రన్. భారత దేశ చలన చిత్రాల్లో ఇది వరకు కనీ విని ఎరుగని యాక్షన్ సన్నివేశాలు సాహూ చిత్రం లో ఉంటాయి అని నిర్మాతలు చెబుతున్నారు. సాహో లో శ్రద్ధ కపూర్ హీరోయిన్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది.

Comments

comments

Share this post

scroll to top