శ‌త్రుస్థావ‌రాల‌పై దాడి చేసేందుకు రుస్తుం-2 డ్రోన్ సిద్ధం..!

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు నేడు టెక్నాల‌జీ ప‌రంగా ఎంత ముందుకు దూసుకెళ్తున్నాయో అంద‌రికీ తెలిసిందే. అనేక రంగాల్లో టెక్నాల‌జీ ప్ర‌భావం మ‌న‌కు క‌నిపిస్తోంది. ప్ర‌ధానంగా చెప్పాలంటే అనేక దేశాలు ర‌క్ష‌ణ రంగంలో ఇత‌ర దేశాల క‌న్నా ముందుకు వెళ్లాల‌ని చెప్పి కొత్త త‌ర‌హా సాంకేతిక ప‌రిజ్ఞానంతో త‌యారు చేసిన యుద్ధ ప‌రిక‌రాల‌ను, ఆయుధాల‌ను వాడుతున్నాయి. అయితే అందుకు మ‌న దేశ‌మేమీ అతీతం కాదు. ఇప్ప‌టికే నూత‌న టెక్నాల‌జీతో త‌యారు చేసిన అనేక ఆయుధాలు మ‌న ద‌గ్గ‌ర ఉన్నాయి. ఈ క్ర‌మంలో యూసీఏవీ (అన్‌మ్యాన్డ్ కోంబ్యాట్ ఎయిర్ వెహికిల్‌) పేరిట ఓ కొత్త త‌ర‌హా డ్రోన్‌ను ఈ మధ్యే త‌యారు చేసింది. ఈ డ్రోన్ ఇప్పుడు శ‌త్రు స్థావరాల‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది. దాని పేరు రుస్తుం-2.

rustom-2-1

రుస్తుం-1 డ్రోన్‌కే అనేక మార్పులు, చేర్పులు చేసి రుస్తుం-2 డ్రోన్‌ను త‌యారు చేశారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీవో) వారు దీన్ని త‌యారు చేశారు. క‌ర్ణాట‌కలోని చిత్ర‌దుర్గ జిల్లాలో చ‌ల్ల‌కెరె అనే ఓ ప్రాంతంలో ఈ డ్రోన్‌ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించారు కూడా. ఇది మీడియం ఆల్టిట్యూడ్‌, లాంగ్ ఎండ్యూరెన్స్ (మేల్‌) విభాగానికి చెందుతుంది. ప్రొటోటైప్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల‌ను త‌యారు చేసిన ఇంజినీర్, స్వర్గీయ రుస్తుం ద‌మానియా పేరు మీదుగా ఈ డ్రోన్‌ల‌కు రుస్తుం అని పేరు పెడుతూ వ‌స్తున్నారు.

rustom-2-2

అయితే కొత్త‌గా త‌యారు చేసిన ఈ రుస్తుం-2 డ్రోన్ 24 నుంచి 30 గంట‌ల పాటు ఆగ‌కుండా ప్ర‌యాణించ‌గ‌ల‌దు. దీని రెక్క‌లు 20 మీట‌ర్ల వ‌ర‌కు ఉంటాయి. చూసేందుకు ఎయిర్‌క్రాఫ్ట్‌ను పోలి ఉన్నా రుస్తుం-2 ఒక డ్రోన్‌. ఇందులో మ‌నిషి కూర్చోవాల్సిన ప‌నిలేదు. అందువ‌ల్ల శ‌త్రువుల స్థావ‌రాల‌ను క‌నిపెట్టేందుకు, వాటిపై దాడి చేసేందుకు ఈ డ్రోన్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం ఇలాంటి డ్రోన్‌ల‌ను ఇంకా త‌యారు చేసేందుకు సంబంధిత సైంటిస్టులు, అధికారులు స‌మాయ‌త్తం అవుతున్నారు. ఇవి గ‌న‌క పూర్తిగా అందుబాటులోకి వ‌స్తే అప్పుడు పాక్ వంటి శ‌త్రు దేశాల‌ను మ‌రింత స‌మ‌ర్థవంతంగా ఎదుర్కోవ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top