న‌డుస్తున్న రైలులో నుంచి కింద ప‌డింది ఆమె. అయినా ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డింది. షాకింగ్‌..

ప్ర‌మాదాలు అనేవి మ‌నకు నిజంగా చెప్పి రావు. చెప్ప‌కుండానే వ‌స్తాయి. అవి వ‌చ్చిన‌ప్పుడు కొంద‌రు వాటి వ‌ల్ల ప్రాణాల‌ను కోల్పోతారు. కానీ కొంద‌రు మాత్రం ఆ ప్ర‌మాదాల నుంచి అదృష్ట‌వ‌శాత్తూ సేఫ్‌గా బ‌య‌ట ప‌డ‌తారు. ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఆ యువ‌తి కూడా ఇలాగే ఓ ఘోర ప్ర‌మాదం నుంచి సేఫ్‌గా బ‌య‌ట పడింది. ఇప్పుడు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. నిజానికి ఆమె అంత‌టి ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డిందంటేనే అది అంద‌రికీ షాకింగ్‌లా అనిపించింది. ఇంత‌కీ అస‌లు జ‌రిగిన సంఘ‌ట‌న ఏమిటంటే…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన రాజేశ్వరి విజయవాడ నుండి పూరీ ఎక్స్‌ప్రెస్‌లో సొంత‌ ఊరికి బయలుదేరింది. ఈ క్ర‌మంలోనే పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు- గుమ్ములూరు వద్ద రైలు ప్ర‌యాణిస్తున్న ఆమె తాను కూర్చున్న సీటులో నుంచి లేచి రైలు తలుపు వద్ద నిలబడింది. అయితే ఆమె ప్రమాదవశాత్తూ రైలు నుండి కాలుజారి కిందపడిపోయింది. కానీ ఆమె కింద బుర‌ద‌లో ప‌డ‌డం పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. కాక‌పోతే గాయాలు అవ‌డం చేత ఆమె లేవ‌లేక‌పోయింది. బుర‌ద‌లోనే ఉండిపోయింది.

ఉద‌యం 9 గంట‌ల ప్రాంతంలో ఆమె రైలు నుంచి కింద ప‌డి బుర‌ద‌లో కూరుకుపోగా సుమారుగా 6 గంట‌ల పాటు అలాగే ఉంది. స‌హాయం కోసం చూసింది. 6 గంట‌ల త‌రువాత అటుగా రైలు ప‌ట్టాల‌ను త‌నిఖీ చేస్తూ వ‌చ్చిన రైల్వే గ్యాంగ్‌మెన్ ఆమెను కాపాడారు. ఆమె ఒంటిపై ఉన్న బుర‌ద‌ను నీళ్ల‌తో క‌డిగారు. అనంత‌రం విష‌యాన్ని రైల్వే అధికారుల‌కు చెప్ప‌డంతో వెంట‌నే వారు ఆంబులెన్స్ పంపించారు. దీంతో రాజేశ్వరి ప్రాణాలతో బ‌య‌ట ప‌డింది. ప్ర‌స్తుతం ఆమె ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. కాగా ఆ యువ‌తిని కాపాడిన రైల్వే గ్యాంగ్ మెన్‌ను అంద‌రూ అభినందిస్తున్నారు. నిజంగా వారిని మ‌నం కూడా అభినందించాల్సిందే క‌దా..!

https://telugu.oneindia.com/news/andhra-pradesh/b-ed-student-falls-from-train-condition-critical-224670.html

Comments

comments

Share this post

scroll to top