గాంధీని కాదని FB లో ట్రెండ్ అవుతున్న రుద్రమదేవి ! విడుదలకు ముందు మంచి హైప్.

గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రుద్రమదేవి. ఈ నెల 9 న రిలీజ్ చేయడానికి సర్వం సిద్దం చేసుకున్నాడు గుణశేఖర్.  కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన రుద్రమదేవిగా  అనుష్క నటిస్తుంటే,  అల్లు అర్జున్ కూడా గోనగన్నారెడ్డిగా కనిపించనున్నాడు. బాహుబలి సినిమా తర్వాత చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాల పట్ల ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో రుద్రమదేవితో ముందుకొచ్చాడు గుణశేఖర్. వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమాకు బ్రేకులు వేసుకుంటూ, మరింత అదనపు హంగులు అద్దుకుంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చాడు గుణశేఖర్.

బాహుబలి లాగానే  తన రుద్రమదేవి సినిమాకు సోషల్ మీడియా ప్రచారాన్ని చేసే క్రమంలో చాలా కష్టాలే పడ్డాడు గుణశేఖర్. ఇప్పుడు తాజాగా రుద్రమదేవి ట్రైలర్ ను హిందీలో కూడా రిలీజ్ చేశాడు. అయితే ఈరోజు  ఫేస్ బుక్ ట్రెండింగ్ లో రుద్రమదేవి ఫస్ట్ ప్లేస్ల్ లో ఉంది. గాంధీ జయంతి రోజు గాంధీని కాదని రుద్రమదేవి ట్రెండ్ అవుతుందంటే.. సినిమా పట్ల అభిమానులు ఎంత క్యూరియాసిటితో ఉన్నారో తెలుస్తుంది.

Watch Trailer:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top