బాహుబలి కంటే రుద్రమదేవియే బాగుంటుందంట! దానికి కారణాలు కూడా చెప్పారు!!

తెలుగు సినిమా స్థాయిని  అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన సినిమా రాజమౌళి బాహుబలి…. అయితే ఇప్పుడు తాజాగా అదే లైన్ తో చారిత్రక నేపథ్యం ఉన్న కథతో అక్టోబర్ 9 న థియేటర్స్ లోకి రాబోతుంది గుణశేఖర్ రుద్రమదేవి. ఇప్పుడు రెండు సినిమాల మద్య పోలికలు పెరిగాయ్..  అయితే కొంత మంది అభిమానులు  మాత్రం సినిమా పరంగా బాహుబలి కంటే రుద్రమదేవి యే బాగుంటుందని లెక్కలు కడుతున్నారు… ఎందుకంటే దానికి కొన్ని కాలిక్యులేషన్ ను చూపెడుతున్నారు.

  • బాహబలి తర్వాత వస్తున్న సినిమా కాబట్టి….ఆ స్థాయిని దృష్టిలో పెట్టుకొని రూపొందించి ఉంటారు.
  • బాహుబలి తెలియని చరిత్ర, రుద్రమదేవి తెలిసిన చరిత్ర అందుకే ప్రేక్షకులు ఈ సినిమాకు తొందరగా సింక్ అవుతారు.
  • రాజమౌళి లాగా పార్ట్ 2 తీసే ఉద్దేశ్యం గుణశేఖర్ కు లేదు..కాబట్టి సినిమాను ఫుల్ క్లారిటితో ఎండ్ చేస్తాడు.
  • ఇక మ్యూజిక్ కూడా ఇళయరాజా ఇస్తున్నారు.
  • విడుదలకు ముందు  బాహుబలి అంత హైప్ క్రియేట్ చేయలేదు..దీంతో సినిమా పై భారీ అంచనాలుండవ్.
  • బాహుబలి లో అనుష్కను చినిగిన బట్టలతో చూసిన అనుష్క అభిమానులు ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు.
  • బహుబలి సినిమాతో ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ భల్లాలదేవకు వచ్చింది, అదే భల్లాల దేవ ఇందులోకూడా ఉన్నాడు.
  • ఇక గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ కూడా అధనపు ఆకర్షణగా ఉన్నాడు.

ఇవి అభిమానులు చూపిస్తున్న కారణాలు.. మరి మీరేమంటారు.

Watch Rudramadevi Trailer:

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top