రుద్రదేవుని వేయిస్తంభాల గుడి శాసనం

రుద్రదేవుని కాలంలోనే కాకతీయ సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యమైంది. స్వతంత్ర రాజ్య స్థాపన సందర్భంగా, శక సంవత్సరం 1084 చిత్రభాను సంవత్సరం మాఘ శుధ్ధత్రయోదశికి సరియైన క్రీ.శ.1163 జనవరి 19 శనివారం నాడుఅనుమకొండలో తనపేరున రుద్రేశ్వరదేవుని, వాసుదేవుని, సూర్యదేవునిప్రతిష్ఠించి ఆ త్రికూటానికి వేయిస్తంభాలతో విరాజిల్లే మండపం వున్న దేవాలయాన్ని నిర్మింపజేశాడు. అదే ఇప్పుడు వేయి స్తంభాల గుడిగా పిలవబడుతూoది. ఆలయ పోషణ కొసంగా మద్దిచెఱువుల గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు తెలియజేసే శాసనం వేయిస్తంభాల గుడి శాసనంగా ప్రసిధ్ధమైంది. శాసనంలోని భాష సంస్కృతం. రుద్రదేవుని తండ్రియైన రెండవ ప్రోలరాజు విజయాలు, స్వతంత్ర రాజ్యస్థాపనకు ముందు రుద్రదేవుని విజయాలు అన్నీ కలిపి ఇందులో దాదాపుగా యాభై శ్లోకాలలో చెప్పబడినాయి. భరద్వాజ గోత్రుడు, రామేశ్వరదీక్షితుని పుత్రుడు, అద్వయామృత యతి శిష్యుడు అయిన అచింతేంద్రయతి ఈ శాసనాన్ని ఒక చిన్న కావ్యంలాగా తీర్చి దిద్దాడని భావన.

12278826_863896177058708_7718178782485525251_n

Comments

comments

Share this post

scroll to top