అద్భుతం.! అమోఘం.!! అనిర్వచీనయం!!! సాహో…రుద్రప్రతాప్.!!!!

5 ఏళ్ల వయస్సులో….. మనం ఏం చేశాం! ఓ సారి గుర్తు చేసుకోండి..ఆ…ఏముంది.? స్కూల్ కు వెళ్లనని గోల చేయడం, మనకు కావాల్సిన వస్తువు ఇప్పించేదాక…పేరెంట్స్ దగ్గర మారాం చేయడం. అందరూ ఇంచుమించు ఇంతే కదా! కానీ ఢిల్లీకి చెందిన ఈ కుర్రాడు అలా కాదు….5 ఏళ్ల వయస్సులోనే…. ఢిల్లీ అండర్-14 క్రికెట్ టీమ్ లో చోటు సంపాదించుకున్నాడు. అంతేకాదు వేగంగా దూసుకొస్తున్న బంతులను, స్పిన్ తో మెలికలు తిరుగుతున్న బాల్స్ ను తనదైన స్టైల్ తో ఆడుతూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ఢిల్లీకి చెందిన రుద్రప్రతాప్ కు క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. ఇండియాకు ఆడాలన్నదే అతని లక్ష్యం…దానికనుగుణంగానే మనోడు నిత్యం ప్రాక్టీస్ చేసేవాడు. అతని ఆటతీరును మెచ్చిన సెలెక్టర్లు అతనికి 5 సంవత్సరాల వయస్సు మాత్రమే ఉన్నప్పటికీ…ఢిల్లీ అండర్-14 జట్టుకు ఎంపిక చేశారు. ఇక వేరే జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగిన  రుద్రప్రతాప్ తన బ్యాటింగ్ స్టైల్ తో ఆశ్చర్యపరిచాడు. తన ముందే ఓ బ్యాట్స్మన్  ఔట్ అయినా అతను మాత్రం ఢిఫెన్సివ్ గా ఆడిన తీరు చాలామందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా లెగ్ స్పిన్ లో అతడు ఆడిన తీరు. ఈ వీడియో చూడండి…మీరు కూడా రుద్రప్రతాప్…సాహో అంటారు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top