RTC డ్రైవర్లు ఇలా చేయడం ఎంత వరకు కరెక్టో మీరే చెప్పండి.!

హాయ్,  మాది సూర్యాపేట… ఉద్యోగరీత్యా హైద్రాబాద్ లో ఉంటున్నాను. మొన్న ఓ అత్యవసర పనుండి హైద్రాబాద్ నుండి సూర్యాపేటకు RTC బస్ లో బయలుదేరాను. LB నగర్ సర్కిల్ దగ్గర రాత్రి  10: 30 నిమిషాలకు బస్  ఎక్కాను…బస్ దూసుకుపోతుంది. అంతలోనే ఇంటి నుండి ఫోన్..ఆ అమ్మ నేను బస్ ఎక్కాను 12:30 వరకు అక్కడుంటా…అని చెప్పేసి నిద్రలోకి జారుకున్న….అంతలోనే డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు..హా…బస్ కాసేపు ఆగుతుంది డిన్నర్ టైమ్ అని చెప్పేసి దిగాడు. అదేంటి అని కిందికి దిగి చూశాను. అది రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన 30 కిలోమీటర్ల తర్వాత ఉన్న రోడ్ సైడ్ హోటల్ అది. అక్కడ బస్ ను ఆపాడు.

13312602_1799382020285123_4933696050233499617_n

ఇతనొక్కడే ఆపాడనుకుంటూ పొరపాటే…వరుసగా RTC బస్ లు వచ్చి ఆ హోటల్ దగ్గర ఆగుతున్నాయి. ఓ టీ తాగాని నేను అక్కడున్న బస్ లను నా ఫోన్ తో ఫోటో తీసుకున్న.. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు రేజ్ చేస్తా అవునా? కాదా ? మీరే చెప్పండి.

13327506_1799381983618460_7013141268064023960_n

 • బ్రేక్ ఫాస్ట్, లంచ్,డిన్నర్ ఏదైనా కానీ….  RTC బస్ లను బస్టాప్ లలో తప్ప, బయట ఆపకూడదనే రూల్ ఉందా? లేదా? ఉంటే  అది ఈ డ్రైవర్లకు పట్టదా?
 • ఇలా ప్రైవేట్ హోటల్స్ ముందు ఆపితే…RTC డ్రైవర్ & కండక్టర్లకు సదరు హోటల్ యాజమాన్యం ఫ్రీగా భోజనాన్ని అందిస్తుంది..అంటే వారి ఫ్రీ భోజనం కోసం బస్ ను ఎక్కడ పడితే అక్కడ ఆపుతారా?
 • బస్ ఆపినప్పుడు ఎలాగో బస్ ఆగింది కదా అని అందులోని ప్రయాణికులు చెట్లచాటుకో…రోడ్డు దాటో   టాయిలెట్స్ వెళతారు. ఆ సమయంలో యాక్సిడెంట్ కారణంగానో, పాము కాటు కారణంగానో ఎవరైనా మరణిస్తే దానికి  బాధ్యత ఎవరు?
 • ఇలా బయటి హోటల్స్ ముందు ఆపడం వల్ల 3 గంటల నా జర్నీకి  3 గంటల 45 నిమిషాలకు పైగా పట్టింది. నాకు అంత అర్జెంట్ లేదు కాబట్టి ప్రాబ్లమ్ లేదు..మరీ అర్జంట్ అయిన వారి పరిస్థితి ఏంటి?
 • అయినా 10 దాటిన తర్వాత డిన్నర్ ఏంటి?
 • ఇది ఎంత వరకు కరెక్ట్?

 

వీరి చిత్రాలు చాల ఉంటాయి. హైదరాబాద్ లో నిరుపేదకు గుండె ఆపరేషన్ కంగారులో తెల్ల రేషన్ కార్డు మర్చి పోయారు bcm నుండి hyd వెళ్ళే బస్ డ్రైవర్ ను ఈ రేషన్ కార్డ్ కోసం మీ బస్ దగ్గరకు ఓ వ్యక్తీ వచ్చి తీసుకుంటాడు ప్రాణాపాయం లోవున్న ఒక పేదవాడి సాయం చేయండి అంటే 200 ₹ ఇవ్వమన్నాడు ఇంకో వంద వేసుకొని ట్రైన్ కి వెళ్లి ఇచ్చి రావచ్చు.ఒక్కరు ఇద్దరు తప్ప చాలావరకు ఈ సంస్థలో వారు ఇంతే.

( ఇది ఓ పాఠకుడి కామెంట్.)

Comments

comments

Share this post

5 Replies to “RTC డ్రైవర్లు ఇలా చేయడం ఎంత వరకు కరెక్టో మీరే చెప్పండి.!”

 1. Venkat Reddy says:

  RTC drivers kuda andaru methagaalle. Waste and stupid drivers.

 2. Madhu latha says:

  Avunu nijame, eka ladies elanti problems chala face chestharu, Mari e problems ala solve avuthai

  1. Shiva Reddy says:

   మీరు complaint చేయండి. Complaint చేసిన 15 నిమిషాలలో RTC వాళ్లు స్పందించని పక్షంలో ఈ నంబరుకి 9963652356 కాల్ చేసి చెప్పండి

 3. SathyaPrakash says:

  Apsrtc specialist as the depo manager gets commission, so they stop buses.
  Our government will try to increase fare but never solve this kind of problems.
  That’s why it is in loss.

 4. Prasad says:

  I am came from gulf to hyd by flight.then I need to go vijayawada I go bus stop in airport ticket 1000.for my luggage they ask each person 2000.we are 4.it means we need to pay 8000 extra we ask him.he was talking like idiot.then we go private travels.this is our rtc of andhra and telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top