ర‌జ‌నీకాంత్ సినిమా కాలా లో నటించిన కుక్క ఖ‌రీదు ఎంతో తెలుసా..? షాక‌వుతారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం కాలా. ఈ చిత్రంలో రజినీ డాన్ పాత్రలో నటిస్తున్నాడు. కబాలి ఫేమ్ పా రంజిత్ ఈ చిత్రానికి దర్శకుడు. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా క్యురేషి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నటుడు నానా పాటేకర్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా కాలా చిత్రంలో రజినీకాంత్ గెటప్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నలుపు దుస్తులలో కనిపిస్తున్న‌ప్ప‌టికీ రజినీ ఎప్పటిలాగే త‌న‌దైన‌ స్టైల్ తో అదరగొట్టేశాడు. ఈ మ‌ధ్యే విడుదలైన కాలా సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ కూడా వ‌స్తోంది. కాగా ఈ చిత్ర పోస్టర్స్ లో రజినీకాంత్ పక్కన ఉన్న కుక్క అంద‌రిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కాలా చిత్రంలో రజినీకాంత్ పక్కన కనిపించడంతో ఆ కుక్క దశ తిరిగిపోయింది. ఈ కుక్కని రూ.2 కోట్లు వెచ్చించి కొనుక్కునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని దాని ట్రైనర్ సిమన్ తెలిపాడు. కానీ ఈ కుక్కని తాను అమ్మదలుచుకోలేదని ప్రకటించాడు. ఈ కుక్కంటే రజినీకాంత్ కు చాలా ఇష్టం అని సిమన్ తెలిపారు. షూటింగ్ కు వచ్చే ప్రతి రోజూ రజినీ ఈ కుక్క కోసం ప్రత్యేకమైన బిస్కెట్లు తీసుకుని వచ్చేవారని సిమన్ తెలిపారు. కాలా దర్శకుడు రంజిత్ ఈ చిత్రం కోసం చాలా కుక్కలని పరిశీలించారు. కానీ చెన్నై వీధిలో కనిపించిన ఈ కుక్కని చివరకు ఫైనల్ చేశారని వివరించారు.

ఏది ఏమైనా వీధుల్లో తిరిగే ఓ కుక్కకు ఇంత‌టి ఖ‌రీదు రావ‌డం అంటే మాట‌లు కాదు క‌దా. ఇక ట్రైన‌ర్ సిమ‌న్ ఆ కుక్క‌కు మ‌ణి అని పేరు పెట్టుకున్నాడు. ప్ర‌స్తుతం ఆ కుక్క అత‌ని వ‌ద్దే ఉంటోంది. రూ.2 కోట్లు ఇచ్చినా దాన్ని అమ్మేది లేద‌ని సిమ‌న్ తెలిపాడు. దాన్ని అమ్మే ఉద్దేశం త‌న‌కు లేద‌న్నాడు. వీధుల్లో తిరిగిన కుక్క అయినా ఇప్పుడు దానికి మాత్రం మ‌హ‌ర్ద‌శ ప‌ట్టింద‌నే చెప్ప‌వ‌చ్చు క‌దా..!

http://www.thehansindia.com/posts/index/Cinema/2018-03-09/2-Crore-For-Kaala-Dog/364807

Comments

comments

Share this post

scroll to top