గత ఏడాది రూ.500, రూ.1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ క్రమంలోనే కొత్తగా రూ.500, రూ.2వేల నోట్లను తీసుకువచ్చింది ఆర్బీఐ. అయితే అవి జనాల వద్దకు చేరుకోక ముందే నకిలీలు తయారయ్యాయి. దీంతో ఏవి అసలు నోట్లో, ఏవి నకిలీ నోట్లో తెలుసుకోవడంలో జనాలు కొంత కన్ఫ్యూజన్కు లోనయ్యారు. అయితే రాను రాను నెమ్మదిగా అనుమానాలన్నీ తీరాయనుకోండి. అది వేరే విషయం. తర్వాత అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూ.1000, రూ.100, రూ.50, రూ.20… ఇలా నోట్లను విడుదల చేస్తుందని, ఒక దశలో చేసిందని వార్తలు వచ్చాయి. దీంతో ఆర్బీఐ రంగంలోకి దిగి ఆ సంఖ్యలో కొత్త నోట్లను విడుదల చేయలేదని తెలిపింది. అయితే ఇప్పుడు తాజాగా రూ.1000 నాణేలను విడుదల చేశారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఉందా..? అసలు ఆర్బీఐ రూ.1000 నాణేలను విడుదల చేసిందా..? ఇప్పుడు చూద్దాం..!
రూ.1000 నాణేలు తాజాగా విడుదలయ్యాయని గత వారం నుంచి వార్తలు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే రూ.1000 నాణేలు ఇవే అని తెలియజేస్తూ కొందరు వాటి ఫొటోలను పోస్టుల్లో పెడుతున్నారు. అయితే దీనిపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. రూ.1000 నాణేలను విడుదల చేసింది. అవును, మీరు విన్నది నిజమే. ఇది పుకారు కాదు. నిజంగానే ఆర్బీఐ రూ.1000 నాణేలను విడుదల చేసింది. వాటి గురించి తాజాగా ప్రకటన కూడా చేసింది. అయితే అవి చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే ముద్రించారట. ఎందుకంటే…
తమిళనాడులోని తంజావూరులో ఉన్నబృహదీశ్వరాలయం నిర్మించి 1000 సంవత్సరాలు పూర్తయిందట. అందుకోసమే, ఆ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని దాని జ్ఞాపకార్థం ఆర్బీఐ కొత్తగా రూ.1000 నాణేలను ముద్రించింది. అయితే వీటిని చాలా తక్కువ సంఖ్యలో ముద్రించిందట. అది ఎంత అంటే ఆర్బీఐ చెప్పలేదు. కానీ రూ.1000 నాణేలను మాత్రం ముద్రించినట్టు స్పష్టత ఇచ్చింది. మరి ఆ తక్కువ సంఖ్యలో ముద్రితమైన రూ.1000 నాణేలు ఎవరి వద్దకు వచ్చాయో, ఎక్కడ ఉన్నాయో తెలియదు. అవి దొరికితే లక్ అనే చెప్పవచ్చు..!