మొన్న ఫాన్స్ ఇచ్చిన కోటింగ్ సరిపోలేదనుకుంట..! మరోసారి “ధోని” ని అవమానించిన “పూణే” జట్టు ఓనర్..!

“మహేంద్ర సింగ్ ధోని” ఎప్పుడు ప్రశాంతంగా ఉంది తన ఎత్తులతో ప్రత్యర్థులను ఓడిస్తూ ఉంటాడు. అందుకే అతనిని కెప్టేన్ కూల్ అంటుంటాము. అంతే కాక మ్యాచ్ ను ముగించడంలో అతని తరవాతే ఎవరైనా. ది బెస్ట్ ఫినిషర్ అంటే మహేంద్ర సింగ్ ధోని. 2011 వరల్డ్ కప్ లో అతను ఆడిన ఇన్నింగ్స్, క్యాప్టియన్సీ దీనికి సాక్షం. అతను క్యాప్టియన్సీ వదిలేయగానే ఎంతో బాధపడ్డారు ఫాన్స్ అంతా.

ఇప్పుడు ఐపీఎల్ లో కూడా “రైసింగ్ పూణే” జట్టు “ధోని” ని క్యాప్టియనీ నుండి తొలగించింది. ఏప్రిల్ 8 న జరిగిన పూణే జట్టు మ్యాచ్ లో “ధోని” బాటింగ్ లో విఫలమయ్యాడు. దీనిపై స్పందిస్తూ “పూణే” జట్టు యజమాని మరోసారి సంచలన మైన ట్వీట్ చేసాడు.

https://twitter.com/hvgoenka/status/850688162615656448

బాటింగ్ స్టాటిస్టిక్స్ పెట్టి.. ధోని “స్ట్రైక్ రేట్” తక్కువ ఉందని చూపించాడు. రెండు ఇన్నింగ్స్ లో అతను స్కోర్ చేసింది కేవలం 17 పరుగులు మాత్రమే అని అవమానించాడు. దీనిపై మరోసారి “twitter” లో ధోని అభిమానులు విరుచుకుపడ్డారు. ప్రతి గాడిదకు ఒక రోజు వస్తుందని అతని పై ట్వీట్ చేసారు. మరికొందరు ఐతే స్వయంగా గాడిదనే ట్వీట్ చేస్తుంది అని అన్నారు. భారత జట్టులో అత్యుత్తమ స్ట్రైక్ రేట్ “ధోని” దే, అది తెలుసుకో అని ట్వీట్ చేసారు ధోని అభిమానులు. ఏది ఏమైనా ఇలా భారత అత్యుత్తమ సారధిని పూణే జట్టు ఓనర్ అవమానించడం ఏ మాత్రం బాగోలేదు!

మొదటి మ్యాచ్ గెలిచినా తరవాత ఇలా ట్వీట్ చేసి ధోని ని అవమానించాడు…

“స్మిత్ తన ఆటతో అడవిలో రాజు ఎవరో నిరూపించాడు. ధోని కంటే చాలా బాగా ఆడాడు. క్యాప్టియన్సీ ఇన్నింగ్స్ ఆది గెలిపించాడు. అతనిని క్యాప్టియన్ గా చేయడం మేము చేసిన మంచి పని”

Comments

comments

Share this post

scroll to top