“పూణే” జట్టు యజమాని “ధోని”ని ఎంత నీచంగా అవమానించాడో తెలుసా..? కానీ చివరికి ఫాన్స్ చేతిలో..!

“మహేంద్ర సింగ్ ధోని” ఎప్పుడు ప్రశాంతంగా ఉంది తన ఎత్తులతో ప్రత్యర్థులను ఓడిస్తూ ఉంటాడు. అందుకే అతనిని కెప్టేన్ కూల్ అంటుంటాము. అంతే కాక మ్యాచ్ ను ముగించడంలో అతని తరవాతే ఎవరైనా. ది బెస్ట్ ఫినిషర్ అంటే మహేంద్ర సింగ్ ధోని. 2011 వరల్డ్ కప్ లో అతను ఆడిన ఇన్నింగ్స్, క్యాప్టియన్సీ దీనికి సాక్షం. అతను క్యాప్టియన్సీ వదిలేయగానే ఎంతో బాధపడ్డారు ఫాన్స్ అంతా. ఇప్పుడు ఐపీఎల్ లో కూడా “రైసింగ్ పూణే” జట్టు “ధోని” ని క్యాప్టియనీ నుండి తొలగించింది. ఏప్రిల్ 6  న జరిగిన పూణే జట్టు తొలి మ్యాచ్ లో ముంబైపై గణ విజయం సాధించింది..!

పూణే విజయంపై స్పందిస్తూ పూణే జట్టు యజమాని “హర్ష గోయెంకా” ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసి ధోని అభిమానుల చేత తిట్లు తిన్నారు. ఇంతకీ అతను ఏమని ట్వీట్ చేసాడంటే.

“స్మిత్ తన ఆటతో అడవిలో రాజు ఎవరో నిరూపించాడు. ధోని కంటే చాలా బాగా ఆడాడు. క్యాప్టియన్సీ ఇన్నింగ్స్ ఆది గెలిపించాడు. అతనిని క్యాప్టియన్ గా చేయడం మేము చేసిన మంచి పని”

ఇలా అని “ధోని” ని అవమానించాడు. ధోని అభిమానులు అతనిపై ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు. అసలు “ధోని” లేకుంటే “పూణే” జట్టుకి ఫాన్స్ ఉండరు. పూణే జట్టు మొత్తం కలిపి ఉన్నంత ఫ్యాన్స్ “ధోని” కి ఉన్న ఫాన్స్ లో ఒక్క శాతం కూడా ఉండరు. వచ్చే సంవత్సరం చెన్నై టీం తరుపున ధోని ఆడి అడవికి రాజు ఎవరో నిరూపిస్తారు. నిజంగా పూణే ఓనర్ ధోని పై ఇలాంటి కామెంట్స్ అతనికి సిగ్గు చేటు అని విమర్శల వర్షం కురిపించారు అభిమానులు! దీనిపై “రహానే” కూడా స్పందించి “ధోని” ఒక గొప్ప నాయకుడు అని చెప్పారు!

Comments

comments

Share this post

scroll to top