మరోసారి “ధోని” మీద సంచలన వాఖ్యలు చేసిన “పూణే జట్టు ఓనర్, గంగూలీ”..యూ టర్న్ కొట్టి ఊసరవెల్లిలా మారారు

మొన్నటివరకు తిట్టిన వారే విజయం పొందగానే మనవడు అంటూ దగ్గరికి వస్తారు. అది సాధారణ మానుషాలకైనా సెలెబ్రిటీలకైనా వర్తిస్తుంది. ధోని ఆటపై ఎన్నో విమర్శలు వచ్చాయన్న సంగతి అందరికి తెలిసిందే. పూణే జట్టు ఓనర్ సోదరుడు “హర్ష గోయెంకే” ఇటీవల “ధోని” ఆటపై కామెంట్స్ చేసారు. “స్మిత్” అడవికి రాజు అన్నారు. ధోని బాటింగ్ ను కూడా అవమానించారు. అంతేకాకుండా భారత జట్టు మాజీ సారధి “సౌరవ్ గంగూలీ” కూడా కామెంట్స్ చేసారు. “ధోని” ఐపీఎల్ ప్రదర్శన అంత గొప్పగా ఏం లేదు. ఇలా అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి తీసుకోలేము అని..!

శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో పుణెను ‘మిస్టర్‌ కూల్‌’ గెలిపించాడు. 31 బంతుల్లో 61 పరుగులు బాదాడు. దీంతో ధోనిపై హర్ష్ గోయెంకా ప్రశంసలు కురిపించారు. ‘ధోని మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు మళ్లీ ఫామ్‌ లోకి రావడం గొప్పగా అన్పిస్తోంది. అతడిని మించిన ఫినిషర్‌ లేడ’ని మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశారు.  అత్యుత్తమ ఫినిషర్‌ అంటూ ఆకాశానికెత్తారు.

 

https://twitter.com/hvgoenka/status/855784531042816000

ఇది ఇలా ఉండగా…”సౌరవ్ గంగూలీ” కూడా మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ధోని అద్భుతమైన ఆట ఆడాడు. అందుకే నేనెప్పుడూ అతన్ని నాలుగో స్థానంలో ఆడమంటున్నాను. సిక్స్ లు ఎలా కొట్టాడో చూసాం కదా. మిగిలిన మ్యాచ్లు కూడా అతను బాగా ఆడాలి. ఐపీఎల్ మొత్తంలో ధోనీది ఇది రెండో అర్ధ సెంచరీ మాత్రమే. ఇంకొన్ని మంచి ప్రదర్శనలు అతను చేయాలి..

కోల్కత్త జట్టు ఓనర్ “షారుక్ ఖాన్” అయితే మొదటి ఐపీఎల్ బిడ్డింగ్ లో “ధోని” ని కొనలేకపోయామని బాధపడ్డాడు. 2018 బిడ్డింగ్ లో ధోని ని కొనడానికి చివరికి నా బట్టలు అమ్మేయడానికైనా సిద్ధమే అన్నారు..!

 

Comments

comments

Share this post

scroll to top