“రైసింగ్ పూణే సూపర్ జైన్ట్స్” జట్టు ఫాన్స్ కి అనుకోని ట్విస్ట్…బీసీసీఐ తెలిపిన చేదువార్త ఏంటో తెలుసా..?

2013 లో ఐపీఎల్ స్కాం విషయంలో “రాజస్థాన్, చెన్నై” టీంలను సుప్రీమ్ కోర్ట్ నిషేదించింది. రెండు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. తాజా సమాచారం ప్రకారం బీసీసీఐ 2018 లో రాజస్థాన్, చెన్నై జట్లకు భారీ వెల్కమ్ చెప్పనుంది అంట. పూణే జట్టుకి మాత్రం చేదువార్తే మిగలనుంది. బీసీసీఐ సీఈఓ “రాహుల్” ఇటీవలే “రాజస్థాన్, చెన్నై” జట్లు 2018 ఐపీఎల్ లో తిరిగి రానున్నాయి అని కన్ఫర్మ్ చేసారు.

బీసీసీఐ సీఈఓ కథనం ప్రకారం “రైసింగ్ పూణే సూపర్ జైన్ట్స్ , గుజరాత్ లయన్స్” ఐపీఎల్ – 2018 లో ఉండబోవు అంట. ఐపీఎల్ 2018 లో టీముల సంఖ్య పెంచే ఉద్దేశం లేదు అంట. చెన్నై , రాజస్థాన్ అభిమానులకు ఈ వార్త ఓ కొత్త ఊరట అయినప్పటికీ “పూణే, గుజరాత్” జట్ల అభిమానులకు మాత్రం చేదు వార్తగా మిగిలిపోతుంది. అయితే మునపటిలాగే అదే టీం తో “చెన్నై, రాజస్థాన్” ఆడతాయా. లేక “పూణే, గుజరాత్” జట్ల సభ్యులను మరోసారి వేలం వేసి “చెన్నై, రాజస్థాన్” జట్లు కొనుక్కుంటాయా? అనేది స్పష్టత లేదు.

దీనిపై మీ స్పందన ఏంటి? కామెంట్స్ లో తెలపండి!

Comments

comments

Share this post

scroll to top