బెంగళూరు జట్టును ఆ హోటల్ ఎలా అవమానించిందో తెలుసా.? నెటిజెన్లు చూసి నవ్వుకుంటున్నారు.!

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగుళూరు.. ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్ ఈ జట్టుకు ఏమాత్రం క‌ల‌సి రాలేదు. జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక్క‌డే రాణిస్తున్నాడు. మిగిలిన ప్లేయ‌ర్లు అంత‌గా రాణించ‌డం లేదు. దీంతో బెంగుళూరు జ‌ట్టు ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. మొత్తం బెంగుళూరు టీం 8 మ్యాచ్‌లు ఆడ‌గా కేవ‌లం మూడింటిలోనే గెలుపొందింది. 5 మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో అక్క‌డి ఫ్యాన్స్ ఆ జ‌ట్ట‌ను దారుణంగా విమ‌ర్శిస్తున్నారు. అందులో భాగంగానే ఆర్సీబీ టీంకు వ్య‌తిరేకంగా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శలు వ‌స్తున్నాయి.

ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్ ఆరంభంలో ఏప్రిల్ 7వ తేదీన బెంగుళూరులోని హాషా కేఫ్ వారు ఆర్‌సీబీ జ‌ట్టుకు మ‌ద్ద‌తుగా తాము ఇచ్చే బిల్స్‌పై E Saala Cup Namde అనే స్లోగ‌న్ రాశారు. దానికి అర్థం This year, cup is ours అని వ‌స్తుంది. అయితే అలా నినాదం ఇచ్చిన‌ప్ప‌టికీ ఆర్‌సీబీ మాత్రం అన్ని మ్యాచుల్లోనూ ఓడిపోతూ వ‌స్తోంది. దీంతో ఆ కేఫ్ వారు ప్ర‌స్తుతం నినాదం మార్చారు. Next saala cup namde అని మ‌రో సందేశాన్ని బిల్స్‌పై ప్రింట్ చేస్తున్నారు.

https://twitter.com/centurygowdaa/status/991154780415279104

Next saala cup namde అంటే Next year, cup is ours అని అర్థం వ‌స్తుంది. దీంతో ఇదే సందేశాన్ని అటు ఆర్‌సీబీ అభిమానులు కూడా సోష‌ల్ మీడియాలో ట్యాగ్ చేస్తున్నారు. ఆర్‌సీబీ ప్లేయ‌ర్ల‌కు తెలిసేలా త‌మ వాణి వినిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆ కేఫ్ స‌ద‌రు సందేశాల‌తో ఇచ్చిన బిల్ ఫొటోలు ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి. అయితే మ‌రి.. బెంగుళూరుకు ఇక చాన్స్ లేదా.. అంటే లేద‌నే చెప్పాలి. ఇంకొన్ని మ్యాచులు ఉన్నాయి కానీ.. వాటిని వ‌రుస‌గా గెలిస్తే అప్పుడు పాయింట్స్ టేబుల్‌లో స్థానం ఖ‌రారు అయ్యేందుకు చాలా స్వ‌ల్ప అవ‌కాశాలుంటాయి. చూద్దాం.. మ‌రి ఏం జ‌రుగుతుందో..!

Comments

comments

Share this post

scroll to top