రోషగాడు మూవీ రివ్యూ.మళ్ళీ ట్రాక్ లో పడ్డ విజయ్ ఆంటోనీ.

AP2TG Staff

బిచ్చగాడు మూవీ తో చాలా ఫేమస్ అయ్యాడు విజయ్ ఆంటోనీ, ఆ తరువాత వచ్చిన బేతాళుడు సినిమా తో పర్వాలేదనిపించాడు, కానీ బేతాళుడు తరువాత రిలీజ్ చేసిన సినిమాలన్నీ అపజయాలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు రోషగాడు మూవీ తో మరో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. విజయ్ ఆంటోనీ ‘రోషగాడు’ సినిమా లో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఈ రోజు రోషగాడు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది, రోషగాడు రివ్యూ మీకోసం:


1st హాఫ్ మొత్తం బి,సి సెంటర్ ల ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తీసినట్టున్నారు, మాస్ ఎలిమెంట్స్ బాగున్నాయి, సెకండ్ హాఫ్ పర్లేదు.. ఎమోషన్స్ ని ఈ సినిమా లో బాగా చూపించారు. ఒక పోలీస్ ఆఫీసర్ నిజాయితీగా ఉంటె ఎలా ఉంటుంది అనేది ఈ చిత్రం లో మెయిన్ గా చూపించారు. బిచ్చగాడు మూవీ అంత రేంజ్ లో లేకపోయినా, రోషగాడు పర్లేదు అనిపిస్తాడు.

డ్రైనేజీ క్లీనింగ్ సీన్ కానీ, సాటి పోలీస్ లకు ధైర్యం చెప్పే సీన్స్, జనాలకు పోలీస్ ల మీద నమ్మకం కలిగించాలనుకొనే సీన్స్ లో విజయ్ ఆంటోనీ చాలా బాగా నటించాడు. 1st హాఫ్ లో కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన నివేద పేతురాజ్ చాలా బాగా నటించింది, పోలీస్ ఆఫీసర్ గా తను చేసిన యాక్షన్ అందరిని ఆకట్టుకుంటుంది. హిజ్రా పోలీస్ ఆఫీసర్ గా నటించిన హిజ్రా నటన కూడా అందరిని ఆకట్టుకుంటుంది. టాక్సీవాలా, అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాలతో పోటీ పడుతున్న రోషగాడు, ఎంత మేరకు కలెక్ట్ చేస్తాడో చూడాలి.

Comments

comments