2 రోజుల్లో 336 మరుగుదొడ్లను దగ్గరుండీ మరీ కట్టించిన కలెక్టర్.

సంకల్పం ఉంటే ఏదైనా సాద్య‌మే అని నిరూపించారు ఆ జిల్లా క‌లెక్ట‌ర్. ఇప్ప‌టికి మారు మూల గ్రామాలే కాదు ఓ మోస్తారు గ్రామాలు కూడా ఇంకా బ‌హిర్భూమికి వెళ్లాల్సిన ప‌రిస్థితుల‌న్నాయ‌ని తెలుసుకుని చ‌లించిపోయారు ఆయ‌న‌. ఆ గ్రామాల్లో మ‌రుగుదొడ్లు లేక మ‌హిళ‌లు, బాలిక‌లు ప‌డుతున్న క‌ష్టాల‌ను అర్థం చేసుకున్న క‌లెక్ట‌ర్ ఒక్క రోజులేనే ఆ గ్రామాన్ని స్వ‌చ్చ గ్రామంగా మార్చేశారు. ఒక‌టి కాదు రెండు కాదు 336 మ‌రుగుదొడ్ల ను ఒకే రోజులో నిర్మించేలా ప్ర‌ణాళిక‌లు చేసి గ్రామాస్తుల చేత శ‌భాష్ సార్ అనిపించుకున్నారు. ఇంత‌కీ ఆ క‌లెక్ట‌ర్ ఎవ‌రు.. ఈ స్వ‌చ్చ కార్య‌క్ర‌మం ఎక్క‌డ జ‌రిగిందో తెలుసుకుందామా..

వ‌ల‌స‌ల‌కు పెట్టింది పేరు పాల‌మూరు. ఒక‌ప్పుడు ప‌రిస్థితి ఎలా ఉందో మొన్న‌టి వ‌ర‌కు కూడా అలాగే ఉండేది. కానీ జిల్లా క‌లెక్ట‌ర్ గా రోనాల్డ్ రోస్ ఎప్పుడైతే భాద్య‌త‌లు తీసుకున్నారో అప్ప‌టి నుండి ప‌రిస్థితిలో మార్పు క‌నిపిస్తోంది. ప‌ల్లె ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలిసిన మ‌నిషిగా ముద్ర‌ప‌డ్డ క‌లెక్ట‌ర్.. అదే ప‌ల్లెల్లో మ‌రింత వెలుగులు నింపేందుకు ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు.

‘స్వచ్ఛ పాలమూరు’ లక్ష్యంగా సాగుతున్న కార్య‌క్ర‌మంలో భాగంగా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్ హన్వాడ మండలం సల్లోనిపల్లిని సంద‌ర్శించారు… స్వ‌చ్చ పాల‌మూరు ప్రారంభం అయి నెల‌లు గ‌డుస్తున్నా ఇప్ప‌టికి ఈ ప‌ల్లెలో మ‌రుగుదొడ్లు లేకపోవ‌డంతో ఒకింత ఆవేద‌న‌కు గుర‌య్యారు క‌లెక్ట‌ర్. వెంట‌నే అధికారుల‌ను పిలిపించి రెండు రోజుల్లో స‌ల్లోనిప‌ల్లెలో వంద‌శాతం మ‌రుగుదొడ్లు పూర్త‌వ్వాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు ఇవ్వ‌డం మాత్ర‌మే కాదు ద‌గ్గ‌రుండి మ‌రీ నిర్మాణాల‌ను పూర్తి చేశారు. దీంతో 48 గంటల్లో 336 మరుగుదొడ్ల నిర్మాణంతో వంద శాతం మ‌రుగుదొడ్ల నిర్మాణం సాధించింది సల్లోనిపల్లి గ్రామం.

636151255911591371
ఈ ప్రాంతంలోని రెండు తండాలతో కలిపి మొత్తం జనాభా 2,244 ఉండగా ఇళ్లు 384 ఉన్నాయి. ఇందులో మరుగుదొడ్లు ఉన్న‌వి కేవ‌లం 48 ఇళ్లలో మాత్రమే. ఈ నేపథ్యంలో మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలిచేలా, అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేలా 48 గంటల్లోనే 336 మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభించి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు క‌లెక్ట‌ర్ రోనాల్డ్ రాస్. ముందుగా ర‌చించిన ప్ర‌ణాళిక ప్ర‌కారం అందుకు కావాల్సిన సామాగ్రిన‌ గ్రామానికి త‌న కంటే ముందుగానే చేర‌వేశారు. 600ల మంది మేస్త్రీల స‌హ‌యంతో ఈ బృహ‌త్ కార్యాన్ని ప్రారంభించారు. ద‌గ్గ‌రుండి మ‌రీ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించి ప్ర‌జ‌ల స‌హ‌క‌రంతో విజ‌యం సాధించారు. దీంతో స‌ల్లోనిప‌ల్లి గ్రామంలో సంతోషం వెల్లివిరిసింది. ఇన్ని దినాల నుండి ఏ ఒక్క‌రు త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌ని.. క‌నీసం తమ‌కు చెప్పే వారు కూడా లేర‌ని.. క‌లెక్ట‌ర్ గారి ద‌య‌తో త‌మ ఇళ్ల‌కు క‌ల‌వ‌చ్చింద‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు స‌ల్లోని ప‌ల్లె వాసులు.

Comments

comments

Share this post

scroll to top