రోజా…ఈ పేరు వినగానే… జబర్థస్త్ లో కిలకిల నవ్వే ఫేస్ గుర్తుకువస్తుంది. అటు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆమె ఓ ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకుంది. ఇప్పుడు జెమినీ టివిలో రచ్చబండ అంటూ కూలబోతున్న కాపురాలను చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. జబర్థస్త్ లో ప్రతి చిన్నజోక్ కు పడిపడి నవ్వే రోజా….రచ్చబండలో తన విశ్వరూపం చూపింది. చెంప పగులగొడతాను అంటూ ఓ వ్యక్తి పైపైకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
వరంగల్ జిల్లా కు చెందిన ఓ మహిళ కష్టాలను విన్న రోజా కరిగిపోయారు. ఆమె భర్త ఆమెకు చేసిన అన్యాయాన్ని వింటూ రగిలిపోయారు. పెళ్లి చేసుకొని,ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చి, ఇప్పుడు మరో మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తికి లెఫ్ట్ రైట్ ఇచ్చారు. ఈ సంధర్భంగా అతడు చెప్పిన సమాధానం కూడా చాలా తప్పుగా ఉంది. ఓ అమ్మాయితో గడిపింది, దానిని వీడియో తీసుకున్నాని చెప్పడంతో కోపంతో రగిలిన రోజా…అతనిని కొట్టడానికి లేచారు.
అందరూ రోజా టాకింగ్ పవర్ కు జై అంటుంటే కొందరేమో ..ఈ ప్రోగ్రామ్స్ సంసారాలను నిలబెట్టడానికా? లేక నిట్టనిలువునా కూల్చడానికా? అనే కామెంట్స్ చేస్తున్నారు.
Watch Video: