“హాయ్ ఫిజిక్స్” అని అసెంబ్లీ దగ్గర “ఝలీల్ ఖాన్” ను ఎగతాలి చేసిన “రోజా”…తరవాత “ఝలీల్” ఏమన్నారంటే!

“బీకామ్ లో ఫిజిక్స్ ఉంటదా?”…”ఉంటది ఉంటది…బికాం లో ఫిజిక్స్ ఎందుకు ఉండదు”!…ఏ ముహూర్తాన ఇంటర్వ్యూ లో “టీడీపీ ఎం.ఎల్.ఏ ఝలీల్ ఖాన్” ఈ మాట అన్నారో కానీ “సోషల్ మీడియా” లో ఫుల్లీ ట్రెండ్ అయిపోయారు. పాపం ఆయన మీద ఎన్నో ట్రోల్ల్స్ వేసేస్తున్నాయి ఫేస్బుక్ పేజీలు. చివరికి అసెంబ్లీ లో “వైకాపా” అధ్యక్షుడు “జగన్” కూడా హేళన చేసారు బికాం ఫిజిక్స్ అని!..తరవాత “రోజా” తో పాటు మరికొంత మంది “వైకాపా” కార్యకర్తలు కూడా “ఝలీల్ ఖాన్” ను ఎగతాలి చేసారు!

అసెంబ్లీ మీటింగ్ లో “ఝలీల్ ఖాన్” ని చూసి “రోజా” ఇలా అన్నారు “హాయ్ ఫిజిక్స్“. అక్కడితో ఆగకుండా మరికొంత మంది వైకాపా కార్యకర్తలు వచ్చి “బికాం ఫిజిక్స్ అన్నా నమస్తే” అన్నారు. దీనికి “ఝలీల్ ఖాన్” ఇలా సమాధానమిచ్చారు. “మీరు ఎన్నో ధర్నాలు చేసినా రాసిన పాపులారిటీ ఇప్పుడు నాకు కేవలం బికాం ఫిజిక్స్ వల్ల వచ్చేసింది. అయినా మీడియా వారి గురించి తెలిసిందే కదా. తప్పు తప్పుగా ఎడిట్ చేసి టెలికాస్ట్ చేస్తుంటారు. చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ని సింగపూర్ చేస్తా అన్నారు. మరి అదే విధంగా బికాం లో ఫిజిక్స్ కూడా పెడతారేమో”!

Comments

comments

Share this post

scroll to top