జ‌బ‌ర్ధ‌స్త్ నుండి రోజా అవుట్..? ఎందుకో తెలుసా..!

విమర్శలు,వివాదాల నడుమనే ఎన్నో ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న షో జబర్దస్త్..ప్రోగ్రం పట్ల,ప్రోగ్రాంలో వచ్చే బూతుల పట్ల అసహనం ఉన్నప్పటికి అత్యధిక టిఆర్పీతో నడుస్తున్న షో ఏదన్నా ఉందంటే అది జబర్దస్తే..అలాంటి ప్రోగ్రామ్ ఇప్పటివరకూ ఎందరో కమెడియన్స్ ని వెండితెరకు పరిచయం చేసింది.వెండితెరపై అవకాశాలు లేని వారికి అవకాశం ఇచ్చి ఆదుకుంది.ఇన్నేళ్ల  ఈ ప్రోగ్రామ్లో మారనిది ఏదన్నా ఉందంటే అది జడ్జిలు ,యాంకర్లు మాత్రమే..

Image result for jabardasth roja images

జబర్దస్త్ షో కి మొదట యాంకరింగ్ చేసింది అనసూయనే..తరవాత సినిమా అవకాశాలు రావడంతో రష్మికి ఆ బాద్యతలు అప్పచెప్పారు..బుల్లితెరకు గ్లామర్ సొగసులద్దారు ఈ ఇద్దరూ..తర్వాత అనసూయ తిరిగొచ్చాక జబర్దస్త్ ,ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ వారానికి రెండు సార్లు ప్రోగ్రామ్ ని డివైడ్ చేసి ఒక రోజు రష్మి,ఒక రోజు అనసూయ యాంకరింగ్ చేసేలా ఒప్పుకున్నారు.కాని నాగబాబు,రోజా మాత్రం రెండు ప్రోగ్రామ్లకు జడ్జీలుగా వ్యవహరిస్తూ వస్తున్నారు..మొన్నామధ్య రోజా ప్లేస్ ను మంచు లక్ష్మి భర్తీ చేస్తుందన్నారు కాని అది కుదర్లేదు..కాని ఈ సారి రోజా జబర్దస్త్ నుండి తప్పుకుంది అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి దానికి ఊతం ఇస్తుంది వచ్చే వారం రాబోయే ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో..

ప్రోమోలో నాగబాబు పక్కన రోజాలేరు. దీంతో ఒక్క‌సారిగా అభిమానుల్లో చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.ఎల‌క్ష‌న్స్ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న రోజ ఇక జ‌బ‌ర్ధ‌స్త్‌కు గుడ్ బై చేప్పేసిన‌ట్టు ఉన్నార‌ని.. అంతే కాకుండా రోజ జ‌బ‌ర్ధ‌స్త్‌లో జ‌డ్జిగా ఉండ‌డం వ‌ల్ల వైసీపీ అబాసుపాలు కావాల్సి వస్తోందని అంటున్నారు. అందులో భాగంగానే రాజ‌కీయ తెర పైకి వ‌చ్చేస‌రికి రోజా మీదే కాకుండా వైసీపీ పై కూడా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని వైసీపీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నార‌ట‌. అందులో భాగంగా రోజ ఇక జ‌బ‌ర్ధ‌స్త్‌లో క‌నిపించ‌డం క‌ష్ట‌మ‌ని జ‌బ‌ర్ధ‌స్త్ నుండి రోజా అవుట్ అని సోష‌ల్ మీడియాలో వార్త‌లు తెగ ట్రోల్ అవుతున్నాయి.

అయితే ప్రోమోలో నాగబాబు పక్కన హాట్ సీట్లో రష్మి ఉంది.అంటే రష్మి జడ్జిగా,రోజా యాంకర్ గా అవతారమెత్తారా  లేకపోతే రోజాని నిజంగానే తప్ప్పించేశారా అనేది ప్రోగ్రామ్ వస్తే కాని తెలియదు..

Comments

comments

Share this post

scroll to top