జబర్దస్త్ లో మాయమైన రోజా…కొత్త షోకి కొబ్బరికాయ కొట్టింది!?

జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ..జడ్జ్ గా కామెడీ స్కిట్ మంచి చెడ్డలెంచి మార్కులేసిన రోజా..గత కొన్ని ఎపిసోడ్స్ గా జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. ఆమె స్థానంలో మంచు లక్ష్మీ తీర్పులు చెప్పేస్తున్నారు. అలా జబర్దస్త్ కు దూరమైన రోజా  తాజాగా ….ఓ కొత్త షోకి కొబ్బరికాయ కొట్టారు.  జెమినీ టివిలో స్టార్ట్ కానున్న రచ్చబండ అనే రియాల్టీషోకి హోస్ట్ గా వ్యవహరించనున్నారు.కొత్తగా స్టార్ట్ కానున్న  ఈ షో….  బతుకు జట్కా బండి, ఇది కథ కాదు జీవితం…అనే ఫ్యామిలీ గొడవలను సెటిల్  చేసే షో.. లాంటిదే అన్నమాట. ఇప్పటికే జీవిత, జయసుధ, సుమలతలు ఇటువంటి షోలకు హోస్ట్ లుగా వ్యవహరిస్తున్న సమయంలో …అలాంటి ప్రోగ్రామ్ లోకి రోజా అడుగుపెట్టనున్నారు.

జబర్దస్త్ షో ద్వారా…. జనాలకు చాలా దగ్గరైన రోజా , ఈ కొత్త ప్రోగ్రామ్ తో ఏమేరకు జనాలను ఆకట్టుకుంటారో చూడాలి. అయితే ఈ ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ పట్ల ఇప్పటికే జనాల్లో ఓ నెగెటివ్ ఆలోచన ఉంది. దానికి తోడు ప్రతి TV లో ఈ తరహా ప్రోగ్రామ్ లు వస్తున్నాయ్. మరి ఇలాంటి సమయంలో రోజా ఇదే తరహా కార్యక్రమాన్ని ఏ మేరకు సక్సెస్ చేస్తుందో చూడాలి.

ఇప్పటికే జబర్దస్త్ షోకి దూరమైన రోజా.. ఎక్స్ ట్రా జబర్ధస్త్ లో జడ్జ్ గా కంటిన్యూ అవుతున్నారు. మరి అక్కడ అలాగే కంటిన్యూ అవుతారా? లేక దానికి గుడ్ బై చెప్పి..కొత్తగా జెమినీ టివిలో రాబోతున్న ఈ రచ్చబండ ప్రోగ్రామ్ కి పర్మినెంట్ గా పిక్స్ అయిపోతారా? అనేది చూడాలి.

Watch Video: Cilck Here

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top