“రోజా” ని అరెస్ట్ చెసిన పోలీసులు!…ఎక్కడికి తరలించారో కూడా తెలీదు!…కారణం ఏంటో తెలుసా?

“రోజా” గన్నవరం ఫ్లైట్ దిగింది…దిగి దిగగానే బ్యాక్ టెర్మినల్ దగ్గరే “రోజా” ను పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు…ఎక్కడికి తరలించారు అనేది కూడా మీడియాకి తెలియనివ్వలేదు! శాంతి భద్రతలను ఉద్దేశించి అరెస్ట్ చేశామని చెప్పారు!…అసలు కథ ఏంటి? సడన్ గా రోజాని ఎందుకు అరెస్ట్ చేసారు అనుకుంటున్నారా?…

అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుల్లో పాల్గొనేందుకు  ‘‘వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు ఆహ్వానం లేదు. సీపీఎం నాయకురాలు బృందాకరత్, నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్ లను పిలువలేదు. కేవలం చంద్రబాబు నాయుడు ఆయన టీంనే పిలిచారు. సీఎం కేసీఆర్ కూతురు, వెంకయ్యనాయుడు కూతురు, చంద్రబాబు నాయుడు కోడళ్లను పిలుచుకొని తమ సొంత ఫంక్షన్ లా మహిళా పార్లమెంటును జరుపుతున్నారు. ప్రభుత్వం రూ.23కోట్లు ఖర్చు చేసి ఇలాగేనా చేసేది. చంద్రబాబు ప్రభుత్వం మహిళల పట్ల అనుసరిస్తున్న విధానాలు ఎలాంటివో బయటపడ్తాయనే భయంతోనే నన్ను సదస్సుకు హాజరుకాకుండా అడ్డుకున్నారు. వీళ్లు మగాళ్లా? లేక ఆడంగులా?’’ అంటూ రోజా ఫైర్ అయ్యారు.

ఆహ్వానం అందుకున్న “రోజా” ఉదయం 9:30 కి “గన్నవరం” విమానాశ్రయం చేరుకోగానే పోలీస్ లు ప్లాన్ ప్రకారం అక్కడికి చేరుకొని “రోజా” ను అమరావతి వెళ్లనివ్వకుండా “విజయవాడ” వైపు నూతన టెర్మినల్ నుండి తరలించారు.. దీంతో ఆమె ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. ‘మీరు మగాడా? లేక ఆడంగా?’ అంటూ తిట్టారు!

Comments

comments

Share this post

scroll to top