క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ బ్యాట్‌పై ఉన్న బొమ్మ ఏంటో గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

రోహిత్ శ‌ర్మ‌.. ఇండియ‌న్ క్రికెట్ టీంలో పేరుగాంచిన బ్యాట్స్‌మ‌న్ ఇత‌ను. రోహిత్ శ‌ర్మ గురించి ప్ర‌తి క్రికెట్ అభిమానికి తెలుసు. జ‌ట్టు ఎలాంటి సంక‌ట స్థితిలో ఉన్నా విజ‌య తీరాల‌కు చేర్చ‌గ‌ల స‌మ‌ర్థ‌వంత‌మైన ఆట‌గాళ్ల‌లో రోహిత్ శ‌ర్మ కూడా ఒక‌డు. ప్ర‌స్తుతం రోహిత్ ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ టీంలో ఆడుతున్నాడు. ఆ జ‌ట్టుకు కెప్టెన్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది రోహిత్ ఆడిన ఇన్నింగ్స్ గురించో, లేదంటే అత‌డి ప్ర‌తిభ గురించో, ప‌ర్స న‌ల్ విష‌యం గురించో కాదు. అత‌ని బ్యాట్ గురించి. అవును, అదే. దానిపై కింది భాగంలో ఓ బొమ్మ ఉంది గ‌మ‌నించారు క‌దా..! ఆ.. అదే.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

రోహిత్ శ‌ర్మ బ్యాట్ పై కింది భాగంలో ఉన్న ఆ బొమ్మ‌ను చూశారు క‌దా. అది ఓ ఖ‌డ్గ‌మృగం బొమ్మ‌. అయితే రోహిత్ శ‌ర్మ దాన్ని ఎందుకు వేసుకున్నాడో తెలుసా..? ఆ.. ఏముందీ.. అదేదో కంపెనీ ప్ర‌మోష‌న్ కోసం అయి ఉంటుంది.. అంటారు క‌దా.. కానీ అది కాదు. అవును, క‌రెక్టే. అది కంపెనీ ప్ర‌మోష‌న్ కు చెందిన‌ది కాదు. సొరై రైనో అనే అరుదైన జాతికి చెందిన ఖ‌డ్గ‌మృగం బొమ్మ అది. ఆ జాతికి చెందిన ఖ‌డ్గ‌మృగాలు అంత‌రిపోయాయి. వాటి సంఖ్య బాగా త‌క్కువ‌గా ఉంది.

ఈ క్ర‌మంలో సొరై ఖ‌డ్గ‌మృగాల‌ను ర‌క్షించాల‌ని కోరుతూ ఓ క్యాంపెయిన్ న‌డుస్తోంది. అందులో భాగంగానే రోహిత్ శ‌ర్మ ఆ క్యాంపెయిన్‌కు మ‌ద్ద‌తుగా ఆ ఖ‌డ్గ‌మృగాల‌ను ర‌క్షించాల‌నే అంశాన్ని అంద‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోసం త‌న బ్యాట్‌పై ఆ ఖ‌డ్గ‌మృగం బొమ్మ వేసుకున్నాడు. ఇదీ.. ఆ బొమ్మ వెనుక ఉన్న అస‌లు విష‌యం. అయితే ఈ విష‌యాన్ని ఇంగ్లండ్ మాజీ క్రికెట్ ప్లేయ‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా వెల్ల‌డించాడు. దీంతో ఈ విష‌యం కాస్తా ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతోంది. కాగా కెవిన్ కూడా నిజానికి ఈ క్యాంపెయిన్‌లో మెంబ‌ర్‌. తాను కూడా ఆ జాతికి చెందిన ఖ‌డ్గ‌మృగాల కోసం మ‌ద్ద‌తు తెలుపుతున్నాడు. ఈ క్ర‌మంలోనే రోహిత్ శ‌ర్మ కూడా ఈ క్యాంపెయిన్‌లోకి వ‌చ్చేసరికి కెవిన్ రోహిత్‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా అభినందిస్తూ ట్వీట్ చేశాడు. అది ఇప్పుడు వైర‌ల్ అవుతోంది..!

Comments

comments

Share this post

scroll to top