ధోనీని త‌రువాత బ్యాటింగ్‌కు పిల‌వ‌డం కోసం రోహిత్ శ‌ర్మ ఎలా సిగ్న‌ల్ ఇచ్చాడో తెలుసా..?

భార‌త్‌, శ్రీ‌లంక జ‌ట్ల మ‌ధ్య తాజాగా ఇండోర్‌లో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇన్‌చార్జి కెప్టెన్ రోహిత్ శ‌ర్మ వీర బాదుడు బాది సెంచ‌రీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ ఫోర్లు, సిక్సుల వ‌ర‌ద పారించాడు. దీంతో భార‌త్ శ్రీ‌లంక‌పై సునాయాసంగా గెలిచింది. 88 ప‌రుగుల తేడాతో లంక జ‌ట్టుపై భార‌త్ గెలుపొందింది. దీంతో 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భార‌త్‌కు 2-0 ఆధిక్యం ల‌భించింది. అయితే విరాట్ కోహ్లి టీమిండియా కెప్టెన్ అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం అత‌ను సెల‌వులో ఉన్నందున రోహిత్ శ‌ర్మ కెప్టెన్‌గా ప‌నిచేస్తున్నాడు. ఓ వైపు ఆట‌గాడిగానే గాక కెప్టెన్‌గా కూడా రోహిత్ మంచి మార్కులే కొట్టేస్తున్నాడు.

అయితే తాజాగా ఇండోర్‌లో జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో రోహిత్ 43 బంతుల్లో 118 ప‌రుగులు చేశాడ‌ని తెలుసు క‌దా. అయితే లంక బౌలింగ్ లో రోహిత్ చివ‌ర‌కు ఔట‌య్యాడు. ఈ క్ర‌మంలో మరో బ్యాట్స్‌మెన్ రావాల్సి ఉంది. కానీ రోహిత్ శ‌ర్మ ధోని అయితే బాగుంటుందని భావించాడు. దీంతో తాను ఔట్ కాగానే ధోనీని బ్యాటింగ్‌కు దిగాల‌ని కోచ్ ర‌వి శాస్త్రికి సిగ్న‌ల్ చేసి చెప్పాడు.

మ్యాచ్‌లో రోహిత్ ఔట్ అవ్వ‌గానే ధోనీని రావ‌ల్సిందిగా కోచ్ ర‌విశాస్త్రికి సిగ్న‌ల్ ఇచ్చాడు. అందుకు రోహిత్ శ‌ర్మ కీపింగ్ చేసిట్టుగా రెండు చేతుల‌ను క‌లిపి దోసిలి పెట్టాడు. దీన్ని అర్థం చేసుకున్న కోచ్ ర‌విశాస్త్రి ధోనీని బ్యాటింగ్‌కు పంపాడు. అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన ధోనీ కూడా త‌నదైన శైలిలో ఆడ‌డంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. అయితే మ్యాచ్‌లో అలా ధోనీని బ్యాటింగ్‌కు ర‌మ్మ‌ని చెప్ప‌డం కోసం రోహిత్ చేసిన సిగ్న‌ల్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. చాలా మంది రోహిత్ కెప్టెన్సీని ప్ర‌శంస‌ల్లో ముంచెత్తుతున్నారు. రోహిత్ శ‌ర్మ క్రికెట్ ఆట‌గాడిగానే గాక‌, కెప్టెన్‌గా కూడా బాగా హుందాగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రోహిత్ చేసిన సిగ్న‌ల్ నిజంగా ఆశ్చ‌ర్య‌క‌రం క‌దా..!

Comments

comments

Share this post

scroll to top