రోహిత్ శర్మ మరో రికార్డ్.! అయినా ఓడిన టీమ్ ఇండియా.

రోహిత్ శర్మ. సొగసరి బాట్స్ మెన్ ఉంటూనే, విధ్వంసాన్ని సృష్టిస్తూ బౌలర్ల భరతం పడతాడు. ఒక్కసారి గ్రౌండ్ లో పాతుకుపోయాడంటే అతడిని ఆపడం ఇక ఎవరివల్లా కాదు. సాఫ్ట్ గా కనిపిస్తున్నా చిచ్చరపిడుగులా దూసుకెళ్తాడు.ఈ రోజు భారత్-ఆసీస్ జట్ల మధ్య  పెర్త్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో రోహిత్ శర్మ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి, శతకం సాధించి అజేయంగా నిలిచాడు. 163 బంతుల్లో 173 పరుగులు (13ఫోర్లు,7సిక్సర్లు) తో నాటౌట్ గా నిలిచి, నిర్ణీత 50 ఓవర్లలో భారత్ స్కోర్ 309పరుగులు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.  ఆస్ట్రేలియా మీద ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ స్కోర్ . ఇది వరకు ఈ రికార్డ్ వివ్ రిచర్డ్స్ పేరు మీద ఉంది.

  • ఆస్ట్రేలియా గడ్డపై పెర్త్ లో శతకం సాధించిన మొదటి ఇండియన్ క్రికెటర్.
  • ఈ శతకంతో వన్డేలలో 9 శతకాలు పూర్తిచేశాడు.
  • ఆస్ట్రేలియాలో మూడో సెంచురీ చేసిన రెండవ భారత క్రికెటర్. అంతకుముందు వివిఎస్ లక్ష్మణ్ మూడు సెంచురీలు సాధించాడు.
  • తాజాగా ఈ మ్యాచ్ తో ఆస్ట్రేలియాపై 19 ఇన్నింగ్స్ లోనే 1027 పరుగులను చేశాడు.
  • ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్:95.53
  • ఓవరాల్ గా రోహిత్ సగటు:68.00
  • ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ హైఎస్ట్ స్కోర్:209
అయితే రోహిత్ శర్మ వీరోచిత ఇన్నింగ్స్ ఆడినా, ఆస్ట్రేలియా ఈ వన్డేలో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. 310 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ బ్యాట్స్ మెన్ లలో స్టీవెన్ స్మిత్ 149, బెయిలీ 112 పరుగులు చేశారు. 5 వికెట్ల తేడాతో భారత్ పై ఆసీస్ విజయం సాధించింది.
Watch Video: (Rohit Sharma Batting):

Comments

comments

Share this post

scroll to top