రెండో ఇన్నింగ్స్ ముందు “రోహిత్” టీం కి ఏం చెప్పాడో తెలుసా..? చివరి ఓవర్ ప్లాన్ ఏంటో తెలుసా..?

ఐపీఎల్ ఫైనల్. ముంబై మొదటి ఇన్నింగ్స్..వరసగా వికెట్లు కోల్పోతూ వస్తుంది. క్రునాల్ పాండ్య 40 పరుగులు చేసి కొంచెం మంచి స్కోర్ తీసుకొచ్చాడు. కానీ పూణే  జట్టుకి 130 పరుగులు ఛేదించడం చాలా సులభమే. రహానే, తివారి, స్మిత్, ధోని, లాంటి బాట్స్మెన్ లతో ఈజీ గ గెలిచేయచ్చు అనుకున్నారు. కానీ అంచనాలు తారుమారయ్యాయి. చివరి ఓవర్ వరకు ఉత్కంతంగా సాగింది మ్యాచ్. ఒక్క పరుగు తేడాతో గెలిచింది ముంబై. టీం మెంబెర్స్ పై ప్రశంసలు కురిపించాడు రోహిత్.

అయితే టీం మెంబెర్స్ కి పూణే ఇన్నింగ్స్ మొదలయ్యే ముందు “రోహిత్ శర్మ” ఏమని చెప్పాడో తెలుసా..?

 “ఈ స్కోరును కాపాడుకోవాలంటే తెలివిగా వ్యవహరించాలి. దీని గురించి ఇంతకంటే ఎక్కువ నన్ను అడగలేరు. స్వల్ప స్కోరును కాపాడుకోవాలంటే ముందు మన మీద మనకు పూర్తి నమ్మకం ఉండాలి. తక్కువ స్కోరు చేసినా తుదివరకు పోరాడాలని సహచర ఆటగాళ్లకు చెప్పాను. చివరి మూడు ఓవర్లు మిగులుండగా బౌలర్లపై నమ్మకం ఉంచాను. వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. బౌలర్లు చెప్పినట్టుగానే ఫీల్డింగ్‌ పెట్టాను. నా నమ్మకాన్ని వారు నిలబెట్టార’ని మ్యాచ్‌ ముగిసిన తర్వాత రోహిత్‌ శర్మ అన్నాడు.

చివరి ఓవర్లో ఎలాంటి ప్లాన్ వేసారో చూడండి!

‘చివరి ఓవర్లో పుణె విజయానికి 11 పరుగుల మాత్రమే కావాలి. అప్పటికి పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇంకా అవుట్ కాకపోవడంతో మాకు విజయావకాశాలు తక్కువగానే ఉన్నాయి. స్మిత్ ను కట్టడి చేస్తే గెలుపును సొంతం చేసుకోవచ్చనేది మా ప్రణాళిక. ఆ మేరకు చివరి ఓవర్ వేయడానికి వచ్చిన మిచెల్ జాన్సన్ తో చర్చించా. సాధ్యమైనంత వరకూ స్మిత్ బంతిని పేస్ చేయకుండా విధంగా బౌలింగ్ చేయమనే చెప్పా. మరొకవైపు అప్పుడు జాన్సన్ గాలికి వ్యతిరేక దిశలో బౌలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో స్మిత్ ను గాల్లోకి బంతిని హిట్ చేసేలా చేయాలనుకున్నాం. అప్పుడు గాల్లోకి బంతి లేపితే కచ్చితంగా మాకు అనుకూలంగా ఉంటుందనే అనుకున్నాం. ఆ రకంగా ముందు స్మిత్ విషయంలో సక్సెస్ అయ్యాం. ఆపై పుణె పై ఒత్తిడి పెరిగింది.

ఆఖరి ఓవర్లో పుణె విజయానికి 11 పరుగులు కావల్సిండగా జాన్సన్‌ వేసిన తొలిబంతిని మనోజ్‌ తివారీ బౌండరీ బాదడంతో పుణె సునాయసంగా విజయాన్ని సాధిస్తుందని భావించారు. కానీ రెండో బంతిని భారీ షాట్‌ ఆడే ప్రయత్నించిన మనోజ్‌ లాంగ్‌ ఆన్‌ లో పోలార్డ్‌ క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌ చేరాడు. అయినా అర్ధసెంచరీ చేసిన స్మిత్‌ క్రీజులో ఉండటంతో విజయం పుణె నే వరిస్తుందనుకున్నారు. కాగా మూడో బంతికి స్మిత్‌ గాల్లోకి లేపి అంబటి రాయుడుకు చిక్కాడు. చివరి మూడు బంతులకు 7 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులో కి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ బై రన్‌ తీశాడు. బ్యాటింగ్‌ కు వచ్చిన క్రిస్టియన్‌ ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా రెండు పరుగులు తీసి మూడో​ పరుగుల తీసే ప్రయత్నంలో క్రిస్టియన్ రనౌటయ్యాడు. దీంతో టైటిల్‌ ముంబై సొంతమైంది.

Comments

comments

Share this post

scroll to top