రోహిత్ 200 కొట్టినప్పుడు అతని భార్య రియాక్షన్ చూస్తే ఇది కాదా LOVE అంటే అనుకుంటాము! [VIDEO]

ధర్మశాల వన్డేలో ఘోర పరాజయం రుచి చూపించిన శ్రీలంక బౌలర్లని మొహాలి వన్డేలో బుధవారం రోహిత్ శర్మ కసితీరా దంచేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (208 నాటౌట్: 153 బంతుల్లో 13×4, 12×6) మెరుపు డబుల్ సెంచరీ బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 392 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్ (88: 70 బంతుల్లో 9×4, 2×6), శిఖర్ ధావన్ (68: 67 బంతుల్లో 9×4) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. తొలి వన్డేలో భారత్ టాప్ ఆర్డర్‌ని వణికించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన లక్మల్‌ కేవలం 8 ఓవర్లలోనే 71 పరుగులు సమర్పించుకోగా.. ప్రదీప్ 10 ఓవర్లలో ఏకంగా 106 పరుగులిచ్చుకున్నాడు.

115 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న రోహిత్ ఇక అక్కడ నుంచి టాప్ గేర్‌లో చెలరేగిపోయాడు. ఆకాశమే హద్దుగా వరుస సిక్సర్లు బాదేశాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 44వ ఓవర్ వేసిన లక్మల్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6, 6 బాదేసి మొత్తం 26 పరుగులు పిండుకున్నాడు. తర్వాత ఓవర్ వేసిన ప్రదీప్‌కి సిక్సర్ల శిక్షే విధించిన రోహిత్.. మ్యాచ్ చివరి ఓవర్‌ మూడో బంతిని మిడ్ వికెట్‌గా తరలించి కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీని పూర్తి చేసుకుని సంబరాలు చేసుకున్నాడు. శ్రీలంకపై రోహిత్‌కి ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం.

అతని డబల్ సెంచరీ కి అతని భార్య గర్వపడింది. ఈ రోజు వారిద్దరి పెళ్లి రోజు కావడం మరో విశేషం.

watch video here:

https://twitter.com/PSV_Prashanth/status/940890305989042176

Comments

comments

Share this post

scroll to top