సిగ్గులేకుండా అదే నాయకులకు ఓట్లు వేస్తామని మండిపడ్డ నటి మాధవిలత…

గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సదస్సులో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు వ్యక్తిగత సలహాదారు, కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌కు వచ్చివెళ్లడం,ఈమె రాకతో హైదరాబాద్ అందంగా ముస్తాబైన విషయం తెలిసిందే. రాష్ట్రప్రభుత్వం చేసిన హడావిడి అంతా ఇంతా కాదు..ఇవాంకా రాక సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆమెకు అదిరిపోయే విందు,ప్రత్యేక బహుమానాలు సమర్పన అన్నీ జరిగాయి..

మరోవైపు నెటిజన్లు మా ఏరియాకి రా అంటే మా ఏరియా కి రా..మా రోడ్లు బాగుపడతాయంటూ పోస్టులు… ఇవాంకపై కవితలు,పాటలు ,కథలు అల్లేయడం అన్నీ జరిగాయి..ఆకరుకి సింగర్ సునీత కూడా మా ఏరియాకి రావట్లేదేమో అంటూ పోస్టు పెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది..అయితే ఇవాంక పర్యటన గురించి నటి మాధవిలత ఒక పోస్టు తన ట్విటర్లో  పెట్టింది..కాకపోతే మాధవిలత కోపంతో పోస్టు పెట్టింది..ఇంతకీ ఆమె ఏమని పెట్టిందంటే…

ఇవాంకా వస్తుందని నగరంలో రోడ్లు, పేయింటింగ్‌లు వేసి అందంగా మార్చేశారు. మరీ మన అధినేతలు అమెరికాకు వెళ్లినప్పుడు కొత్తగా వాళ్లేం చేయరు .. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అతిథుల కోసం కాకుండా ప్రజల కోసం పని చేయాలని సూచించింది.మన దేశంలో వీఐపీ ప్రాణాలకి తప్ప మామూలు మనుషులవి ప్రాణాలు కావేమో.. వారి వల్ల ఏలాంటి ప్రాజెక్టులు వస్తాయో తెలియదు కానీ.. వీఐపీల వల్ల ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. అయినా మనం సిగ్గు లేకుండా అదే నాయకులకు ఓట్లేస్తామని తన  ట్విట్‌ చేసింది.

Comments

comments

Share this post

scroll to top