జూబ్లీహిల్స్ ప్రమాదంలో జూ.ఆర్టిస్ట్ మృతి కేసులో షాకింగ్ నిజాలు..అమ్మాయిలు అర్ధరాత్రి ఎక్కడికెళ్తున్నారు?

హైదరాబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు..మొన్నటికి మొన్న న్యూ ఇయర్ రోజున పదహారు వందల మందిని పట్టుకున్నారు..అందులో ప్రదీప్ ఒకడు ..ప్రదీప్ ఎంత తాగాడో తెలుసా..పాయింట్స్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..నిన్న మొన్నటి వరకూ వార్తా ఛానెల్స్ మారుమోగిపోయాయి..మరిప్పుడు తప్పతాగి రోడ్ మీదకి కార్ నడుపుకుంటే వచ్చి నిండు ప్రాణాన్ని బలిగొంటే పోలుసులు ఏమయ్యారు..న్యూస్ ఛానెల్స్ ఏమయ్యాయి.

పీకల దాకా మద్యం తాగి, ఆ మత్తులో ఓ యువతి ప్రాణాలను బలిగొనడంతో పాటు, మరో ఇద్దరు యువతుల ప్రమాదానికి కారణమయ్యాడు విష్ణువర్ధన్ అనే వ్యక్తి.మస్తానీ, ప్రియ, అనూషలు కూకట్‌పల్లి నుంచి జేఎన్‌టీయూ, మాదాపూర్ మీదుగా యూసఫ్‌గూడ బయలుదేరారు. వారు మరో పది నిమిషాల్లో వాళ్లు వెళ్లాల్సిన చోటుకి చేరుకుంటారు అనగా… వీరు వెళ్తున్న స్కూటీని విష్ణు కారు బలంగా ఢీకొట్టడంతో అదే వేగంతో దూసుకెళ్లి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. మస్తాని మృతి చెందగా, అనూష అపస్మారక స్థితిలోకి వెళ్లింది..ఇంకొకరు  ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. విష్ణువర్ధన్ మద్యం తప్పతాగి వాహనం నడపడం వల్ల మూడు కుటుంబాల్లో విషాదం నింపింది.

మృతి చెందిన మస్తానీ జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పలు సినిమాల్లో నటించింది…క్షతగాత్రులను అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అనూష పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. నిందితుడు విష్ణుకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయంగా 206 బ్లడ్ ఆల్కాహాల్ కంటెంట్ ఉన్నట్లుగా తేలింది. .


మద్యం మత్తులో చేసిన తప్పుకు మూడు కుటుంబాలను రోడ్డున పడేసిన నిందితుడు విష్ణువర్ధన్‌ కనీసం బాధితులను ఆదుకునేందుకు ముందుకు రాలేదు. అతడికి హిమాయత్‌నగర్‌లో ఓ ప్లే స్కూల్‌ ఉంది. భార్య వైద్యురాలు. ఈ తరుణంలో వారు బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావచ్చు. కానీ యాక్సిడెంట్ చేయడమే కాదు ..కనీసం వారని పట్టించుకొకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు..మందుబాబులు తాగి రోడు మీదకి రావడం మూలంగా ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోవాలో…

Comments

comments

Share this post

scroll to top