ఇంటి పైకప్పు మీద ల్యాండ్ అయిన మారుతి కారు..! ఎలా సాధ్యమైందో తెలుస్తే షాక్ అవుతారు..!

నేటి త‌రుణంలో మ‌న దేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా రోడ్డు ప్ర‌మాదాలు ఎలా చోటు చేసుకుంటున్నాయో అంద‌రికీ తెలిసిందే. మ‌ద్యం సేవించి వాహ‌నం న‌డ‌పడం, నిర్ల‌క్ష్యంగా డ్రైవింగ్ చేయ‌డం, ట్రాఫిక్ రూల్స్ అతిక్ర‌మించ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతూ ఉంటాయి. అయితే ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు ప్రాణ న‌ష్టం సంభ‌వించేందుకే ఎక్కువ అవ‌కాశం ఉంటుంది. బ‌తికే అవ‌కాశం చాలా త‌క్కువ‌. అందులోనూ ఎలాంటి గాయాలు కాకుండా ప్ర‌మాదం నుంచి సేఫ్‌గా బ‌య‌ట ప‌డ‌డం అంటే.. అది చాలా అరుదుగా జ‌రుగుతుంది. ఆ ర‌హదారిపై జ‌రిగిన ఓ ప్ర‌మాద‌క‌ర‌మైన యాక్సిడెంట్ కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంది. అందులో ప్రాణ‌న‌ష్టం కాదు క‌దా, క‌నీసం అందులో ప్ర‌యాణిస్తున్న వారికి చిన్న దెబ్బ కూడా త‌గ‌ల్లేదు. కానీ యాక్సిడెంట్ మాత్రం తీవ్రంగా జ‌రిగిన‌ట్టు మ‌న‌కు తెలుస్తుంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఉన్న సర్కాఘాట్ లో తాజాగా ఓ రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. మారుతి బ‌లెనో కారు ఒక‌టి ఆ రోడ్డుపై ఒక మూల మ‌లుపు వ‌ద్ద రోడ్డుకు 20 అడుగుల దూరంలో ఉన్న ఓ ఇంటి పైక‌ప్పుపైకి దూసుకెళ్లింది. అయితే కారు ఇంటి పైక‌ప్పు మీద‌కు దూసుకెళ్లి అక్క‌డే ఆగింది. డ్రైవ‌ర్ చాక‌చ‌క్యంతో స‌డెన్ బ్రేక్ వేశాడు. ఏదో వీడియో గేమ్‌లో జ‌రిగిన‌ట్టుగా కార్ ఆ ఇంటి మీద ఆగింది. అక్క‌డి నుంచి కేవ‌లం 4 అడుగులు ముందుకు వెళ్తే పెద్ద లోయ‌లోకి కారు ప‌డిపోయి ఉండేది. కానీ అలా జ‌ర‌గ‌లేదు. నిజంగా ఆ కార్‌లో ప్ర‌యాణిస్తున్న వారి అదృష్ట‌మ‌నే చెప్పాలి.

అయితే ఆ కారు ఇంటి పైక‌ప్పు మీద‌కు ఎలా దూసుకెళ్లిందో తెలియ‌దు కానీ.. ఈ వార్త అక్క‌డ సంచ‌ల‌నమే సృష్టించింది. కారు ఇంటి మీద‌కు చేర‌డంతో దాన్ని మ‌ళ్లీ రోడ్డు మీద‌కు తెచ్చేందుకు బాగా శ్ర‌మించారు. ఇంటి పైక‌ప్పు నుంచి రోడ్డు వ‌ర‌కు ఇనుప స్తంభాల‌ను వేసి వాటిపై ఐర‌న్ ప్లేట్ల‌ను పెట్టి దాని మీద నుంచి కారును వెన‌క్కి తెచ్చారు. కాగా ఈ రోడ్డు ప్రమాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న ఎవ‌రికీ ఎలాంటి గాయం కూడా కాలేదు. అది నిజంగా వారి అదృష్ట‌మే. ఏది ఏమైనా ఈ యాక్సిడెంట్ వార్త మాత్రం ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతోంది..!

Comments

comments

Share this post

scroll to top