“గురు” ఫేమ్ “వెంకటేష్” & “రితిక సింగ్” చెప్పిన ఈ స్ఫూర్తిదాయక మాటలు వింటే జీవితంలో గెలుపంటే ఏంటో తెలుస్తుంది..!

“జీవితం అనేది రైలు ప్రయాణం లాంటిది. తల్లితండ్రులతో ప్రయాణం మొదలవుతుంది. మధ్యలో ఒక స్టేషన్ దగ్గర తల్లితండ్రులు దిగిపోతారు. తరవాత మన స్నేహితులు, అన్న దమ్ములు, ప్రేమించే వారు, పెళ్లి చేసుకున్న జీవిత భాగస్వామి తోడవుతారు. ఇంకొంతమంది జీవితమనే మన రైలులో ఎక్కి దిగిపోతుంటారు. వాళ్ళు ఉన్నారని కూడా ఒకోసారి గుర్తుండదు. కానీ ఏదో ఒక దగ్గర మన ప్రయాణం కూడా ఆగిపోతుందనేది జీవిత సత్యం. ఆ ప్రయాణం ముగిసిపోయేలోపు మనకంటూ కొన్ని జ్ఞపకాలు ఉండాలి.”

ఇది చెప్పింది మన “గురు” విక్టరీ వెంకటేష్ గారు. గురు సినిమా సక్సెస్ తో ఇటీవల “బిట్స్” లో జరిగిన స్పీచ్ లో ఆయన ఇది మాట్లాడారు. జీవితంలో మన పని మనం చూసుకుంటూ ముందుకి వెళితే ఎటువంటి కాంట్రవర్సిస్ కి గురవమ్ము చెప్పారు. అందుకే ఆయనకీ అభిమానులే ఉంటారు కానీ ద్వేషించే వారు ఉండరు.

Watch Video Here:

Victory Venkatesh Speech

“గురు” ఇలా స్పీచ్ ఇస్తే శిష్యురాలు “రితిక సింగ్” కూడా జీవితానికి ఎంతో విలువైన స్ఫూర్తిదాయకమైన స్పీచ్ ఇచ్చింది. లైఫ్ అనేది ఒకటే. లక్ష్యం వైపు పోరాడండి. మధు, సిగరెట్ లాంటి చేదు అలవాట్ల జోలికి వెళ్ళకండి. చేదు మనుషల జోలికి కూడా వెళ్ళకండి. జీవితంలో ప్రతి సంఘటన నుండి తప్పుల్ని తెలుసుకుంది నేర్చుకొని ముందడుగు వేయండి అని చెప్పింది.  తనకి బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం ఉండటం వల్ల కాలేజీ లైఫ్ సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయానని కూడా చెప్పింది.
Ritika Singh Speech:

Comments

comments

Share this post

scroll to top