చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. ఆస్ట్రేలియా కి చుక్కలు చూపించాడు..బేబీ సిట్టర్ ని కాదు భారీ హిట్టర్ ని..

ఆస్ట్రేలియా గడ్డ పైన సెంచరీ చేసిన మొదటి ఇండియన్ వికెట్ కీపర్ గా చరిత్రలోకి ఎక్కాడు రిషబ్ పంత్. అంతే కాకుండా ఓవర్సీస్ లో ఒక ఇన్నింగ్స్ లో ఎక్కువ రన్స్ సాధించిన వికెట్ కీపర్ గా రికార్డు లకి ఎక్కాడు ( ఇంతకముందు పాకిస్థాన్ పైన ధోని 148 రన్స్ చేసారు). ఓవర్సీస్ లో 150+ రన్స్ కొట్టిన మొదటి భారతీయ వికెట్ కీపర్ గా మరో రికార్డు సృష్టించాడు.

తూ మార్, మై మార్ :

నువ్వు కొట్టు, నేను కొడతా అని రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఇద్దరు ఒకరికొకరు పోటీ పడి మరి ఆడారు, జడేజా ఒకే ఓవర్ లో 4 ఫోర్ లు కొట్టి కంగారులను కంగారు పుట్టించాడు. సందు దొరికినప్పుడల్లా ఫోర్ లతో చెలరేగిపోయాడు రిషబ్ పంత్. వీరిద్దరి దూకుడికి కళ్లెం వేయలేకపోయారు ఆస్ట్రేలియా బౌలర్లు.

బేబీ సిట్టర్ ని కాదు భారీ హిట్టర్ ని :

ఇటీవల ఆస్ట్రేలియా టీం కెప్టెన్ పెయిన్ పిల్లోలను చూసుకున్నాడు రిషబ్ పంత్, పెయిన్ భార్య రిషబ్ పంత్ ఒక మంచి బేబీ సిట్టర్ అని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఇప్పుడు తన ఆటతో మంచి బేబీ సిట్టర్ ఏ కాదు అంతకు మించిన మంచి హిట్టర్ అని నిరూపించాడు పంత్. జడేజా పంత్ 7 వ వికెట్ కు 200+ పరుగులని జోడించారు. జడేజా 81 రన్ ల వద్ద అవుట్ అయ్యాడు, రిషబ్ పంత్ 159 పరుగులతో అజేయంగా నిలిచాడు. 4 వ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో ఇండియా 622-7 కి డిక్లేర్ చేసింది. ఈ సిరీస్ లో భారత్ 2-1 తో ముందంజలో ఉంది. 4 వ టెస్ట్ ఏ సిరీస్ లో చివరి టెస్ట్. ఆస్ట్రేలియా గడ్డ పైన కంగారులను కంగారు పుట్టించారు భారత బాట్స్మన్.

 

Comments

comments

Share this post

scroll to top