ఉంగరం… ఆ వేళుకే ఎందుకు పెడతారో తెలుసా?

చేతి వేళ్లకు ఒక్కోదానికి ఒక్కో పేరుంటుంది. చూపుడు వేళు,మధ్యవేళు, ఉంగరపు వేళు,చిటికెన,బొటన వేళని ..ఇలా అయిదే వేళ్ళకు అయిదు విభిన్న పేర్లున్నాయి. అయితే ఇన్ని వేళ్లు ఉండగా ఉంగరాన్ని చేతి నాల్గవ వేళుకే ఎందుకు ధరించాలి? అనే ప్రశ్న చాలా మందిలో ఉత్పన్నం అవుతుంది? వాస్తవానికి ఆవేలును సంస్కృతంలో అనామిక అంటారు…అంటే పేరు పెట్టని వేళని అర్థం. తర్వాత తర్వాత దానిని ఉంగరం అనే ఆభరణాన్ని పెట్టడంతో క్రమంగా దానిని ఉంగరపు వేళు అంటున్నాం.

ఇన్ని వేళ్లు ఉండగా…ఆ వేళుకే ఉంగరం ఎందుకు పెడతారంటే…. మన చేతి ఉంగరపు వేళికి, చెవికి రిలేషన్ షిప్ ఉంటుంది. ఓ సారి ఉంగరపు వేళుని గట్టిగా ప్రెస్ చేసి చూడండి…కుడిచేతి వేళిని ప్రెస్ చేసినప్పుడు కుడి చెవి, ఎడమ చేతి ఉంగరపు వేళిని ప్రెస్ చేసినప్పుడు ఎడమచెవి ప్రతిస్పందిస్తుంటాయి. అంతకు ముందే మనవాళ్లు ఆడ.మగ తేడా లేకుండా చెవులు కుట్టించుకొని చెవికి ఆభరణాలు పెడుతుండే వారు కాబట్టి…దానికి బ్యాలెన్స్ గా చేతి నాల్గవ వేలికి ఉంగరాన్ని ధరించడం స్టార్ట్ చేశారంట…

ఇదే కాదు ఉంగరాన్ని కుడిచేతికే ధరించేవారు, అదికూడా రాగి ఉంగరాన్నే… ఎందుకంటే చాలమంది కుడిచేతితో అన్నం తింటారు. ఆహారం విషతుల్యం అయినప్పుడు అన్నం లో చెయి పెట్టగానే రాగి ఉంగరం కాస్త నీలిరంగులోకి మారుతుందట…అందుకే పూర్వం రాగితో చేసిన ఉంగరాన్నే , అది కూడా కుడి చేతి నాల్గవ వేలికే ధరించేవారట.!

మరో విషయం ఏంటంటే….చాలా మంది ఏదో విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ అప్రయత్నంగానే తమ వేలికి ఉన్న ఉంగారాన్ని సగం వరకు తీస్తూ పెడుతూ ఉంటారు. ఇలా చేయడం కూడా చాల మంచిదట.. ఉంగరాన్ని అలా కదపడం ద్వారా ఉంగరపు వేలు మీద ప్రెషర్ పడుతుంది. ఇది కిడ్నీల పనితీరును, నరాల తీరును మెరుగుపరుస్తుందట. సో ఉంగరాన్ని ఆభరణంగా కాకుండా ఆరోగ్య ప్రధాయినిగా వాడడం మంచిదేనట.!

Comments

comments

Share this post

scroll to top