మీరు పండ్లను ఏ టైం కి తింటున్నారు?..ఏ పండును ఏ సమయంకి తింటే మంచిదో తెలుసుకోండి!

యాపిల్, ద్రాక్ష‌, జామ‌, కివీ, మామిడి, అర‌టి పండు… ఇలా మ‌న‌కు తినేందుకు ర‌క ర‌కాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. ఎవ‌రి స్థోమ‌త‌కు త‌గిన‌ట్టుగా వారు ఆయా పండ్ల‌ను కొని తింటారు. వాటి వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని కూడా అంద‌రికీ తెలుసు. ఎన్నో కీల‌క పోష‌కాలు మ‌న‌కు అందుతాయి. అయితే మీకు తెలుసా..? నిజానికి పండ్ల‌ను రోజులో ఎప్పుడు తినాలో..? వాటిని తినేందుకూ ఓ టైం ఉంటుంది, ఎప్పుడు ప‌డితే అప్పుడు వాటిని తిన‌కూడ‌దు. మ‌రి… పండ్ల‌ను తింటానికి క‌రెక్ట్ టైం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!

fruits

ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున పండ్ల‌ను తినాలి. అదే క‌రెక్ట్ టైం. ఆ టైంలో తింటే పండ్లు తేలిగ్గా జీర్ణ‌మ‌వ‌డ‌మే కాదు, దాంతో మ‌న‌కు పోష‌కాలు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. అయితే గ్యాస్‌, అసిడిటీ, అల్స‌ర్లు ఉన్న‌వారు ప‌ర‌గ‌డుపున పండ్ల‌ను తిన‌రాదు. అదీ ముఖ్యంగా కివీ, నారింజ, పైనాపిల్‌, క్రాన్ బెర్రీలు వంటి విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే నిమ్మ‌జాతి పండ్ల‌ను అస్స‌లు తిన‌రాదు. పిల్ల‌లు, వృద్ధులు కూడా ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున పండ్ల‌ను తిన‌రాదు. లేదంటే వారిలో గ్యాస్ స‌మ‌స్య‌లు ఇంకా ఎక్కువ అవుతాయి.

citrus-fruits

ఉద‌యాన్నే బ్రేక్ ఫాస్ట్ చేసిన గంట త‌రువాత లేదంటే మధ్యాహ్నం భోజ‌నానికి గంట ముందు అయినా పండ్ల‌ను తిన‌వ‌చ్చు. దీనికి ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రాలు లేవు. ఎవ‌రైనా, ఏ పండునైనా నిర్భ‌యంగా తిన‌వ‌చ్చు. దీంతో మెట‌బాలిజం రేటు పెరిగి షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులోకి వ‌స్తాయి. కొవ్వు క‌రుగుతుంది.

fibre-fruits

సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ కు బ‌దులుగా కూడా పండ్ల‌ను ఎవ‌రైనా తిన‌వ‌చ్చు. అలా తిన్నా పోషకాలు మ‌న శ‌రీరానికి స‌మృద్ధిగా అందుతాయి. అయితే ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్నం లంచ్, నైట్ డిన్న‌ర్ చేసిన వెంట‌నే మాత్రం పండ్ల‌ను తిన‌కూడ‌దు. అలా తింటే పోష‌కాలు స‌రిగ్గా అంద‌వు. దీంతోపాటు మ‌నం అంత‌కు ముందు తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు ఇబ్బంది అవుతుంది. గ్యాస్ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ఎవ‌రైనా పైన చెప్పిన‌ట్టుగా నిమ్మ‌జాతికి చెందిన పండ్ల‌ను, ఫైబ‌ర్ ఉన్న పండ్ల‌ను ఎక్కువ‌గా, తియ్య‌గా ఉన్న పండ్ల‌ను త‌క్కువ‌గా తినాలి. అలా తింటేనే పోష‌కాలు స‌రిగ్గా శ‌రీరానికి అందుతాయి. బ్ల‌డ్ షుగ‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది.

diabetic-fruits

షుగ‌ర్ ఎక్కువ ఉన్న‌వారు బొప్పాయి, పైనాపిల్‌, ప్ల‌మ్స్‌, రాస్ప్ బెర్రీలు, పియ‌ర్స్‌, స్ట్రాబెర్రీలు, పీచ్ పండ్లు, యాపిల్స్ తిన‌వ‌చ్చు. మిగ‌తా వారు ఎలాంటి పండ్ల‌నైనా త‌గిన మోతాదులో తింటే మంచిది. ఇక రాత్రి పూట నిద్రించే ముందు యాపిల్‌, అర‌టి పండ్లు, కివీలు, చెర్రీ పండ్లు తింటే మంచిది. వీటిలో సెర‌టోనిన్‌, మెల‌టోనిన్‌, ట్రిప్టోఫాన్ ఎక్కువ‌గా ఉంటాయి. అవి మంచి నిద్ర‌ను అందించ‌డ‌మే కాదు ఆందోళ‌న‌ను, ఒత్తిడిని దూరం చేస్తాయి. దీంతో ఉద‌యం లేచే సరికి తాజాగా ఉంటారు. రాత్రి పూట మామిడి పండ్లు, ద్రాక్ష వంటివి తిన‌కూడ‌దు. తింటే సరిగ్గా నిద్ర ప‌ట్ట‌దు.

Comments

comments

Share this post

scroll to top