కోట్లున్న మారాజులు.మ‌న ఎమ్మెల్యేలు.?

తెలంగాణ ధ‌నిక రాష్ట్రం కాద‌ని ఎవ‌ర‌న్నారు.వారి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఇటీవ‌ల రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలుపొందిన వారిలో అత్య‌ధిక శాతం కోట్ల ఆదాయాన్ని దాటిన వారే ఉండ‌డం గ‌మనార్హం. 40 ల‌క్ష‌ల మందికి పైగా నిరుద్యోగులు ఇవాళ కొలువుల కోసం ఎదురు చూస్తున్నారు. చాలా మంది ఏజ్ బార్ దాటి ల‌బోదిబోమంటున్నారు. ఇంకొంద‌రు కోచింగ్ సెంట‌ర్ల‌లో కొలువుతీరారు. ఉన్న ఖాళీలు ఎపుడు భ‌ర్తీ అవుతాయో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఏ ప్ర‌క్రియ చేపట్టినా అది వివాదాస్ప‌ద‌మే. కోర్టు మెట్లు ఎక్క‌నిదే ఉద్యోగం ద‌క్క‌ని ప‌రిస్థితి ఒక్క ఈ రాష్ట్రంలోనే దాపురించింది. ఇక రైతుల ప‌రిస్థితి చెప్ప‌న‌క్క‌ర్లేదు. చేసిన అప్పులు తీర్చ‌లేక చాలా మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు. క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర ల‌భించ‌క ధాన్యాన్ని అమ్ముకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్ర‌భుత్వం రైతుబంధు ప‌థ‌కం ద్వారా జ‌మ చేసిన డ‌బ్బులు తీసుకున్న రుణాల‌కు జ‌మ చేయ‌డంతో తిరిగి అప్పుల కోసం అర్రులు చాస్తున్నారు బాధితులు. స‌వాల‌క్ష స‌మ‌స్య‌లతో స‌త‌మ‌త‌మ‌వుతోంది తెలంగాణ‌.

కూటి కోసం, ఉపాధి కోసం ల‌క్ష‌లాది మంది అల్లాడుతుంటే.నిన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలిచిన వారిలో ఎక్కువ మంది క‌ర‌డ్‌ప‌త్‌లేన‌ని తేలింది. ప‌దో పాతికో అనుకుంటే ప‌ర్వాలేదు.ఏకంగా 119 మంది ఎమ్మెల్యేల‌కు గాను 106 మంది డ‌బ్బున్న మారాజులేన‌ని స్ప‌ష్టం చేసింది ఓ సంస్థ‌. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసే వీరి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 76 శాతానికి పైగా నిరూప‌ణ కాని కేసులు ఉండ‌డం కూడా ఆందోళ‌న క‌లిగించే అంశం. ఎన్నికైన వారిలో 90 శాతానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్నార‌న్న మాట‌. ఏడు మంది ఎమ్మెల్యేలు అటెంప్ట్ మ‌ర్డ‌ర్ కేసుల్లో ఉన్న వారేన‌ని తెలంగాణ ఎల‌క్ష‌న్ వాచ్ .అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్‌మ్స్ సంస్థ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. 47 శాతం మంది తీవ్ర‌మైన నేరారోప‌ణ‌లు ఎదుర్కుంటున్నార‌ని పేర్కొంది. మహిళ‌ల‌పై హ‌త్యాయ‌త్నం కేసులు ఉండ‌డం ప్ర‌మాద‌క‌రంగా భావించాల్సి ఉంటుంది.

ఈ మొత్తం ఎమ్మెల్యేల‌లో 88 మంది ప్ర‌జాప్ర‌తినిధుల‌లో 50 మంది అధికార పార్టీకి చెందిన వారుండ‌గా.ఇది 57 శాతం సూచిస్తుండ‌గా.కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 19 మంది ఎమ్మెల్యేల‌లో 14 మంది కేసులు ఉన్న‌వారేన‌ని వీరి శాతం 74 శాతంగా న‌మోదైంది. ఎంఐఎం నుండి 7 మంది ఎన్నికైతే వీరిలో 6 మంది పై కేసులు న‌మోదై ఉండ‌డం విచిత్రం. బీజేపీ నుండి ఎంపికైన ఒకే ఒక్క ఎమ్మెల్యేపై కూడా కేసులు న‌మోదై ఉన్నాయి. క‌రోడ్‌ప‌తులు ఎవ‌ర‌న్న విష‌యానికి వ‌స్తే.మొత్తం 119 ఎమ్మెల్యేల‌లో 106 మంది ఆదాయం.ఆస్తులు క‌లిగిన వారే ఉన్నారు. 88 మంది టీఆర్ ఎస్ నుండి ఎమ్మెల్యేలుగా గెలిస్తే వారిలో 83 మంది కోట్లున్న వారే కాఆ.94 శాతంగా న‌మోదైంది. కాంగ్రెస్ పార్టీ నుండి 19 మంది గెలిస్తే అందులో 14 మంది క‌రోడ్ ప‌తులు గా తేలింది. వీరి శాతం 74 గా న‌మోదైంది. ఎంఐఎం నుండి 7 మంది ఎన్నికైతే వారిలో 5 మంది డ‌బ్బున్న వారు కాగా వీరి శాతం 71 గా ఉన్న‌ది. ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిస్తే వీరిలో ఒక‌రు క‌రోడ్ ప‌తిగా తేలింది. ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ త‌నకు కోటి రూపాయ‌ల ఆస్తులు ఉన్న‌ట్లు అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు. మొత్తం కోట్ల‌ల్లో యావ‌రేజ్ అస్సెట్స్ ప‌రంగా చూస్తే. 2014లో మొత్తంగా 7.70 కోట్లుంటే.ఈసారి 15.71 కోట్ల‌కు పెరిగింది. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల ప‌రంగా చూస్తే 14.64 కోట్లుండ‌గా .కాంగ్రెస్ అభ్య‌ర్థుల ఆస్తులు 26.14 కోట్లుండ‌డం విశేషం. ఎంఐఎం ఎమ్మెల్యేల మొత్తంగా చూస్తే 10.84 కోట్లున్న‌ట్లు తేలింది. తెలంగాణ‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల‌లో అత్య‌ధిక కోట్ల రూపాయ‌లు క‌లిగిన ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి రాజ‌గోపాల్ రెడ్డికి ద‌క్కింది.

314 కోట్ల ఆస్తులు ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. టీఆర్ ఎస్ పార్టీకి చెందిన నాగ‌ర్ క‌ర్నూల్ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి మ‌ర్రి జ‌నార్ద‌న్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఆయ‌న త‌న‌కు 161 కోట్ల రూపాయ‌ల ఆస్తులు ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. మూడో స్థానంలో 91 కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌తో పాలేరు నుండి కాంగ్రెస్ నుండి గెలిచిన కందాల ఉపేంద‌ర్ రెడ్డి నిలిచారు. విద్యార్హ‌త‌ల విష‌యానికి వ‌స్తే.5వ త‌ర‌గ‌తి నుండి 12వ త‌ర‌గ‌తి పాసైన ఎమ్మెల్యేల‌లో 44 మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా .మిగ‌తా ఎమ్మెల్యేలు డిగ్రీ, పీజీ అర్హ‌త క‌లిగిన వారున్నారు. 86 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో 31 నుండి 40 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు క‌లిగిన వారుంటే.28 మంది 61 నుండి 80 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు క‌లిగిన వారున్నారు. మిగ‌తా ఎమ్మెల్యేలు 41 నుండి 60 ఏళ్ల మ‌ధ్య ఎన్నికైన వారున్నారు. ఎన్నికైన వారిలో 5 మంది మాత్ర‌మే మ‌హిళ‌లు ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించారు. నీళ్లు లేక నిధులు అంద‌క‌.కొలువులు దొరుక‌క నానా తిప్ప‌లు ప‌డుతుంటే.వీరంతా కోట్ల ఆస్తులు పోగేసుకుని ప్ర‌జా సేవ పేరుతో ఎమ్మెల్యేలుగా చెలామ‌ణి అవుతున్నారు. వీరికి మ‌నం ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాం. ఇక‌నైనా మ‌రోసారి ఓటు వేసే ముందు ఆలోచించాలి. ప్ర‌జ‌లారా మేల్కొండి. ప్ర‌జాస్వామ్యాన్ని ర‌క్షించండి.!

 

Comments

comments

Share this post

scroll to top