ఔరా అనాల్సిందే ఇది చదివాక మీరు! భిక్షగాడినైనా కాకపోతిని ఈ నిరుద్యోగ బతుకు లాగలేక అంటూ అనుకున్న అనుకుంటారు మీరు ఆ నలుగురి హిస్టరీ విన్నాక. ఈ సారి భిక్షమేసేప్పుడు భిక్షగాడి చేతిలో ఖాళీ ప్లేట్ (బొచ్చె) కనబడదు మీకు, దాని పేరు మీద అతడు సంపాదించిన బ్యాంక్ బాలెన్స్ లు, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ , ముత్తూట్ లో దాచిన బంగారమే కనిపిస్తాయ్.. ఇక ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తా… ఇండియా లోనే 4 గురు రిచెస్ట్ బెగ్గర్స్ ను.
1)
ఇతని పేరు భరత్ జైన్.. ముంబాయిలో 70 లక్షల విలువగల రెండు ప్లాట్స్ ఇతని సొంతం, ఇతని సంపాదన 60 వేలు. ఒక జ్యూస్ షాప్ రెంట్ కు కూడా ఇచ్చాడు దాని పేరు మీద నెలకు ఓ 10 వేలు అదనపు ఇన్ కమ్ ఇతని బ్యాంక్ అకౌంట్లో జమా అయిపోతాయి. ఇతని ఇద్దరి కొడుకులు కార్పోరేట్ కాలేజ్ లో ప్లస్ 2 చదువుతున్నారు.
2)
పై పోటో లోని బెగ్గర్ గారి పేరు కృష్ణ కుమార్, ఇతను కూడా ముంబాయి లోనే అతని డ్యూటీ (అడుక్కోవడం) చేస్తుంటాడు. 5 లక్షల విలువ గల ఫ్లాట్ ఉంది ఇతనికి. ఇతని తమ్ముడు కూడా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాడు. అన్నే అతనికి ప్రేరణ.
పేస్ బుక్ అప్ డేట్స్ కొరకు.. మమ్మల్ని ఫాలో అవ్వండి.
3)
ఇక్కడ ఫోటో మిస్ అయ్యింది. కానీ ఆమె పేరు సార్వతియ దేవి. ది రిచెస్ట్ ఫిమేల్ బెగ్గర్ ఇన్ ఇండియా గా పేరు సంపాదించింది ఈమె. సంవత్సరానికి 36 వేల రూపాయల హెల్త్ ప్రీమియమ్ కడుతుంది. ఇదే డ్యూటీ చేస్తూ ఆమె తన కూతుర్లకి పెళ్లి కూడా చేసేసింది. మరో విషయం ఎంటంటే ఆమె చేసిన యాత్రలు మనలో ఎవ్వరూ చేసి ఉండరు. ఎంందుకంటే ఎక్కడ విశేషం ఉంటే అక్కడ డ్యూటీ ఎక్కుతుంది ఈమె.
4)
ఇతని పేరు మాసు. ఇతని గురించి చెబితే మీరు షాక్ అవుతారు. అవును ఇతని బెగ్గింగ్ మెథడ్ డిఫరెంట్ గా సినిమాలో చూపించినట్టుగా ఉంటోంది. తన సొంత ఆటో లో ముందుగా సెలెక్ట్ చేసుకున్న ప్రాంతానికి వచ్చేస్తాడు. తన ఆటోలోనే బట్టలు మార్చుకొని డ్యూటీ ఎక్కుతాడు ఓ ఎనిమిది గంటలు బెగ్గింగ్ డ్యూటీ అయిపోగానే… రిటర్న్ టు ఆటో, చేంజ్ డ్రస్…. తన ఆటలో ఇంటిబాట పట్టేస్తాడు.
ఇది బెగ్గర్ స్టోరి… ఇది విన్నాక ఇది బెటర్ అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే అడుక్కునేటోనికి 64 కూరలు, వండుకునేటోనికి ఒక్కటే కూర అనే సామెత ఉండనే ఉంది. కానీ స్వశక్తితో సంపాధించిన ప్రతి పైసా లో ఆ శ్రమ తాలూకు గర్వం కనిపిస్తోంది.