శ్రీదేవి జీవితంలోని సెకెండ్ షేడ్స్ గురించి చెప్పిన రామ్ గోపాల్ వ‌ర్మ‌.

శ్రీదేవి మ‌ర‌ణం త‌ర్వాత వ‌రుస ట్వీట్లు చేస్తున్న రామ్ గోపాల్ వ‌ర్మ‌… My Love Letter To Sridevi’s Fans అన్న పేరుతో నిన్న ఓ నోట్ నే విడుద‌ల చేశారు. ఈ నోట్ లో శ్రీదేవి జీవితంలోని సెకెండ్ షేడ్స్ ను వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు ఆర్జీవి.! స్వేఛ్చా విహంగం నుండి పంజ‌రంలో ప‌క్షిగా శ్రీదేవి మారిన క్ర‌మాన్ని, దానికి దారి తీసిన ప‌రిస్థితుల‌ను క్షుణ్ణంగా తెలిపారు వ‌ర్మ‌…..

ఆర్జీవి నోట్ కు తెలుగు అనువాదం:

జీవితాలు బయటకు కనిపించే కోణాలకు భిన్నంగా ఉంటాయి.అందుకు శ్రీదేవి జీవితం మినహాయింపేమీ కాదు. తన తండ్రి మరణం వరకు స్వేచ్ఛా విహంగంలా బతికిన శ్రీదేవి, తర్వాత పంజరంలో పక్షిగా మారారు. అందుకు ఆమె తల్లి అతిజాగ్రత్తే కారణం. అప్పట్లో చాలామంది నటులకు పారితోషికంలో ఎక్కువ భాగాన్ని నల్లధనం రూపంలో చెల్లించేవారు. శ్రీదేవి సంపాదన విషయంలో ఆమె తండ్రి బంధువులు, సంబంధీకులను నమ్మారు. ఆయన చనిపోయిన తర్వాత అంతా మోసగించారు. అతిజాగ్రత్తనో, అమాయకత్వమో.. శ్రీదేవి సంపాదనను ఆమె తల్లి వివాదాస్పద ఆస్తుల్లో పెట్టుబడి పెట్టారు.

అదంతా ఊడ్చుకుపోయింది. బోనీకపూర్ పరిచయమయ్యేనాటికి ఆమె చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. బోనీ కూడా అప్పటికే అప్పుల కారణంగా పూర్తిగా నష్టపోయి ఉన్నారు. అమెరికాలో చేసిన సర్జరీ వికటించి శ్రీదేవి తల్లి మతిస్థిమితం కోల్పోయింది. అదే అదునుగా శ్రీదేవికి మిగిలిన ఆస్తుల్లో వాటా కావాలంటూ ఆమె సోదరి శ్రీలత కోర్టుకెక్కింది. అలాంటి దశలో శ్రీదేవికి బోనీకపూర్ నిజమైన తోడుగా కనిపిస్తే, బోనీ క‌పూర్ తల్లికి మాత్రం శ్రీదేవి రాక్షసిలా కనిపించింది. చివరిదాకా శ్రీదేవిని శత్రువులా చూసిన బోనీ తల్లి తన బంధువులందరికీ అలాగే నూరిపోసింది. ఓసారి ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో అందరిముందే శ్రీదేవి కడుపుపై పిడిగుద్దులు కురిపించిందామె. ప్రతీ నటికి పెరుగుతున్న వయసుతో కలవరం (అందాన్ని కోల్పోతానని) మొదలవుతుంది. శ్రీదేవి కూడా అందుకోసమే సర్జరీలను ఆశ్రయించారు. కెమెరా ముందే కాదు.. నిజజీవితానికి, తన లోపలి ఆందోళనలకూ మేకప్ వేసుకుని బతికేశారు.

Comments

comments

Share this post

scroll to top