“జంబలకిడిపంబ”మూవీ రివ్యూ..!

మగాళ్లు ఆడవారిలా, ఆడాళ్లు మగవారిలా ప్రవర్తించడాన్ని ‘జంబలకిడిపంబ’ అంటున్నారు. హాస్యరస చిత్రాలతో తెలుగువాళ్లను విపరీతంగా నవ్వించిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తీసుకొచ్చిన ఈ పదమే కాదు సినిమా కూడా అప్పట్లో బ్లాక్ బస్టర్. తరతరాలు గుర్తుండిపోయేలా ‘జంబలకిడిపంబ’ పేరిట విలక్షణమైన హాస్య చిత్రాన్ని తెరకెక్కించారయన. అప్పటి నుంచి ఈ పదం బాగా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు దాన్నే మళ్లీ టైటిల్‌గా తీసుకుని హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి హీరోగా సినిమా తెరకెక్కింది.

పేరుకు తగ్గట్టే ఈ సినిమాలోనూ అటు ఇటుగా ప్రవర్తిస్తారట. రెండు ఆడ, మగ ఆత్మలు విరుద్ధంగా పురుషుడు, స్త్రీ శరీరాల్లోకి ప్రవేశిస్తాయి. ఆ స్త్రీ, పురుషులు భార్యాభర్తలు. దీంతో వారి మధ్య మనస్పర్థలు వస్తాయి. అవి విడాకులు తీసుకునేంత వరకు వెళ్తాయి. ఈ మధ్యలో బోలెడన్ని ట్విస్టులు. ఇంతకీ వారు విడాకులు తీసుకోవాలని ఎందుకనుకుంటారు? ఆ ఆత్మల కారణంగా శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నానిలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది సినిమాలో చూడాలి.

హాస్య నటుడు నుంచి హీరోగా మారిన శ్రీనివాసరెడ్డి.. ఇప్పటికే ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’, ‘ఆనందో బ్రహ్మ’ సినిమాలతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్‌ను వాడుకోవడంతోపాటు ఇంచుమించుగా అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన సినిమా కావడంతో విజయం ఖాయమని శ్రీనివాసరెడ్డి ఆశిస్తున్నారు. దీనికితోడు పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, రఘుబాబు, సత్యం రాజేష్, ధన్‌రాజ్ వంటి కమెడియన్లు ఉండటంతో కడుపుబ్బా నవ్వించడం ఖాయమని విశ్లేషకుల మాట.

నటీనట: శ్రీనివాసరెడ్డి,సిద్ధి ఇద్నాని,పోసాని కృష్ణమురళి,వెన్నెల

వర్గం: కిషోర్,రఘుబాబు,సత్యం రాజేష్,ధన్‌రాజ్

దర్శకత్వం: జె.బి.మురళీకృష్ణ

శైలి: Comedy,డ్రామా

వ్యవధి: 141

Movie Review Rating:

2.5/5

Comments

comments

Share this post

scroll to top